టాలీవుడ్ సోగ్గాడు, అందగాడు ఈ బిరుదులు కేవలం శోభన్ బాబుకు మాత్రమే సొంతం, అంతలా తన అందంతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన డ్యాన్స్, నటనతోను ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే శోభన్ బాబు.. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలాంటి స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీని దక్కించుకున్నాడు. కెరీర్‌లో పెట్టుకున్న ఓ స్ట్రిక్ట్ రూల్ కేవలం హీరోగా మాత్రమే నటించాలి అనుకున్నాడు.
అది చివరి వరకు ఆయన కొనసాగించాడు. ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కీలకపాత్రలో నటించడానికి కోట్లు ఇస్తామని ఎంతమంది ఆశ చూపిన నో చెప్పేసాడు. ఇక శోభన్ బాబు అందం కేవలం సాధరణ లేడీ ఫ్యాన్ ఫాలోయింగే కాదు.. ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సైతం ప్రేమలో పడ్డారు. ఎంతోమంది హీరోయిన్లతో కలిసి ఆడి పాడిన శోభన్ బాబు.. జయప్రద, జయసుధ, శ్రీదేవి, రాధ, మాధవి, లక్ష్మీ, విజయశాంతి లాంటి స్టార్ హీరోయిన్ల అందరితోను నటించాడు.
వీరిలో ఒకరిని మాత్రం శోభన్ బాబు చాలా స్పెషల్గా అత్త అత్త అని పిలుచుకునే వాడట. ఇంతకీ అంత స్పెషల్ గా ఆయన పిలిచే ఆ హీరోయిన్ ఎవరో కాదు జయప్రద. శోభన్ బాబుకు మొదటి నుంచి తనపై చాలా అభిమానమట. జయప్రద, శోభన్ బాబు ఎన్నో సినిమాల్లో నటించారు. అందులో దాదాపు అన్ని హిట్లుగానే నిలిచాయి. ఇక.. ఆయన సెట్లో కాని.. బయటకాని.. జయప్రదను అత్త అని పిలుస్తూ ఆట పట్టించే వాడట. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది.