సినీ ఇండస్ట్రీలో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి నటుడిగా తన సత్తా చాటుకున్నాడు ఆది పినిశెట్టి. తనకు పాత్ర నచ్చితే చాలు.. ఎలాంటి సినిమా కైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆది పినిశెట్టి.. తాజాగా శబ్దం సినిమాలో నటించాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు టీం ప్రమోషన్స్‌లో సందడి చేశారు. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ కోసం స్టార్ యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శబ్ధం యూనిట్ ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేశారు.
డైరెక్టర్ అరివళగన్, థమన్, ఆది పినిశెట్టి కాంబోలోనే గతంలో వైశాలి వచ్చి బ్లాక్‌బస్టర్ అందుకుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత అదే బ్యాక్ డ్రాప్‌తో.. మళ్ళీ సేమ్ కాంబోలో శబ్దం సినిమా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ఆదితో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి.. చేసిన అల్లర్లు గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ షేర్ చేసుకున్నాడు. చెన్నైలో ఉన్నప్పుడు ఆది నా బర్త్ డే కి సర్ప్రైజ్ చేయాలని అర్ధరాత్రి 12 గంటలకు.. అప్పుడే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ దగ్గరకు రమ్మని కాల్ చేశాడని.. కేక్ కట్ చేసిన కాసేపటికి పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి వచ్చి.. అరివళగన్, ఆది పినిశెట్టిలను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని.. నా బర్త్ డే కావడంతో నన్ను వదిలేసారని చెప్పుకొచ్చాడు.
రాత్రంతా టీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఆది, అరివళగన్.. ఉదయాన్నే నాకు ఫోన్ చేసి మేము రిలీజ్ అయ్యాం. పార్టీ ఎక్కడా అని అడిగారని.. నిజానికి బర్త్డే సందర్భంగా మేము ఫ్లై ఓవర్‌లో క్రాకర్స్ పెల్చచడంతో.. ఆ పెట్రోలింగ్ సిబ్బంది మా దగ్గరకు వచ్చారని.. ఇక ఆ ఫ్లై ఓవర్ పక్కనే.. ఓ తమిళనాడు మంత్రి నివాసం ఉండడం.. అప్పటికే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నిద్రపోకపోవడంతో.. వెంటనే పోలీసులు ఎలర్ట్ అయి.. మా వద్దకు వచ్చారని థమన్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆపేసామంటూ వివరించాడు. ప్రస్తుతం థమన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.