తారక్ – ప్రశాంత్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ పై అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే..!

టాలీవుడ్‌లో ఎంతోమంది దర్శకులుగా అడుగుపెట్టి.. స్టార్ డైరెక్టర్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసిన అతి తక్కువ సినిమాలతోనే సెన్సేషనల్ సక్సెస్‌లు అందుకుంటూ స్టార్ డైరెక్టర్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్‌తో సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా.. తాజాగా తారక్‌ నుంచి వచ్చిన దేవర కేవలం రూ.500 కోట్ల మార్కెట్లు మాత్రమే టచ్ చేసింది. ఇలాంటి క్రమంలో తోటి హీరోలకు గట్టి పోటీ ఇవ్వాలనే కసితో ఉన్నాడు తారక్.

కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమా షూట్ ను కంప్లీట్ చేసుకున్నాడు. ఇక మార్చ్ నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూట్‌లో పాల్గొనడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పై తారక్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందినన్న ఈ సినిమాతో.. తారక్‌ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో.. ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. అయితే.. తాజాగా సినిమా ఇంటర్వెల్ బ్యాక్ సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారుతుంది. ప్ర‌శాంత్ నీల్‌ మాస్ ఎలివేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ క్రమంలో ప్ర‌భాస్ స‌లార్‌ ఇంటర్వెల్ సీన్‌లో అచ్చం డైనోసార్ మాదిరి కనిపించాడు. ఇక ఇంచుమించు ఇలాంటి బ్లాక్ బ‌స్టర్ యాక్షన్ ఎపిసోడ్‌ని ప్రశాంత్.. ఏకంగా 2000 మందితో.. తారక్‌ సినిమా కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. వాళ్ళంద‌రితో యాక్షన్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడట. ఇప్పటివరకు మనం ఏ సినిమాలో చూడని విధంగా భారీ ఎమోషన్స్‌తో.. ఎంతో కృరంగా.. ఈ సీన్ ఉండబోతుందని.. సినిమా చూసేటప్పుడు ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయం అంటూ టాక్‌ నడుస్తుంది. ఫైట్ మూవీ మొత్త‌నికే హైలైట్‌గా నిలిచేలా భారీగా ప్ర‌శాంత్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ క్రమంలోనే సినిమా షూట్ శ‌ర‌వేగంగా పూర్తి చేసి.. 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.