చరణ్‌ని అలాంటి రోల్‌లో చూడాలి.. ఉపాసన క్రేజీ కోరిక విన్నారా..?

తెలుగు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా చ‌ర‌ణ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఆయన పేరును పెద్దగా వాడుకోకుండా.. తన టాలెంట్‌తో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు చరణ్. వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ.. గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదగాడు. తన స‌క్స‌స్‌కు ఎంచుకున్న కథలు కూడా ఓ కారణం అని చెప్పడంలో సందేహం లేదు. ఇలాంటి క్రమంలోనే.. చరణ్ బ్యాక్ టు బ్యాక్ బడా ప్రాజెక్టులతో బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సన్న డైరెక్షన్‌లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతున్న క్రమంలోనే.. సుకుమార్ డైరెక్షన్లో చరణ్ నటించాల్సిన సినిమాలు కూడా సెట్స్‌పైకి తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నాడట. తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ న్యూస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలో ఉపాసన చరణ్‌ను ఓ క్రేజి క్యారెక్ట‌ర్‌లో చూడాలని ఆశ పడుతుందట. ఇంతకీ ఉపాసన డ్రీమ్ క్యారెక్టర్ మరేదో కాదు.. చరణ్ ఇప్పటివరకు హీరోగా తన పాజిటివ్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఒక్కసారి కూడా చరణ్ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించిందే లేదు.

ఈ క్రమంలోనే.. చరణ్ నెగటివ్ ఫేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తే చూడాలని ఉంది అంటూ.. ఉపాసన తన క్రేజీ కోరికను వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ఉపవాసన డ్రీమ్‌ క్యారెక్టర్ లో తాము కూడా చ‌ర‌ణ్ చూడాలని ఆశపడుతున్నామంటూ వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు హీరోయిజ్ చూపించిన చరణ్.. నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలను నటించి సక్సెస్ అందుకుంటే.. నటుడుగా అన్ని విధాల చరణ్ ఫుల్ ఫీల్ అయినట్లే అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి చరణ్ ఉపాసన కోరికను తీరుస్తాడా.. లేదా.. చరణ్‌ను అలాంటి పవర్ ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించే డైరెక్టర్ ఎవరో వేచి చూడాలి.