ఇద్దరు స్టార్ హీరోల ముద్దుల చెల్లి.. ఈ స్టార్ట్ సింగర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

కోలీవుడ్‌ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సూర్య, కార్తీలకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక్కడ కూడా కోట్లాదిమంది అభిమానాని సంపాదించుకున్న ఈ అన్న, తమ్ముళ్లకు.. ఓ చెల్లి ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే.. ఆమె కూడా ఇండస్ట్రీలోనే రాణిస్తుంది. తను ఓ స్టార్ సింగర్ అని తెలుసుకుని.. ప్రస్తుతం అంత ఆశ్చర్యపోతున్నారు. ఇంద‌కి ఆ స్టార్ సింగర్ ఎవరో కాదు బృిందా శివకుమార్. ఎస్.. మీరు వింటున్నది కరెక్టే. సూర్య, కార్తిలా ముద్దుల చెల్లెలే బృిందా. ఇక తన ఇద్దరు అన్నలు స్టార్ హీరోలుగా దూసుకుపోతుంటే.. ఈ అమ్మడు సైలెంట్ గా త‌న టాలెంట్‌తో మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తుంది. సింగర్‌గా తన కెరీర్‌ను 2018లో మిస్టర్ చంద్రమౌళి సినిమాతో ప్రారంభించింది.

Brindha Sivakumar-Singer - Happy Rakshabandhan to All Brothers and  Sisters👫🏽!!💕 God created Guardian Angels in the form of Siblings  😊🙏🏼💕!! | Facebook

శివకుమార్ అగ‌రం ఫౌండేషన్ ఈవెంట్ వీడియోలలో.. నిర్మాత జి.ధనుంజయన్‌కు బృిందా వాయిస్ నచ్చడంతో త‌న గాత్రానికి ఫిదా అయ్యారు ఈ క్రమంలోనే వెంటనే తన సినిమా కోసం బృిందాను సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు మొదలైన బృిందా సినీ ప్రస్థానం.. ఎప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా దూసుకుపోతుంది. రాక్షసి, జాక్పాట్, పొన్మ‌గళ్ వందాల్‌ సినిమాల్లో తన అద్భుతమైన పాటలతో మెప్పించింది. ఇక పొన్మంగ‌ళ్ వంద‌ల్‌ సినిమాలో వా చెల్లం సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. అయితే.. ఇక్కడ విశేషమేంటంటే ఈ సాంగ్‌ను బృిందానే పాడింది. అది కూడా ఈ సినిమాలో హీరోయిన్ జ్యోతిక. అంటే బృిందా వదిన. తన వదిన కోసమే ఈ సాంగ్ ను ఆలపించడం విశేషం.

Brindha Sivakumar-Singer

ఈ సాంగ్‌తో బృిందాకు మంచి ఇమేజ్ ఏర్పడింది. అయితే సింగర్ కంటే ముందే.. బృిందాకు హీరోయిన్ గాను అవకాశం వచ్చిందట. కానీ.. ఆమె యాక్టింగ్ పై అసలు ఇంట్రెస్ట్ లేకపోవడంతో.. బాయోయ్ వద్దు అనుకుందట. మ్యూజిక్ అంటేనే తనకు ఇష్టమని.. డిసైడ్ అయిన బృిందా ఫిలిం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కూడా.. చాలా కాలం ఫేమ్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ప్ర‌స్తుతం హీరోయిన్‌ల‌కు కూడా చెప్తూ అదరగొడుతున్న బృిందా.. బ్రహ్మస్త్ర సినిమాలో అలియా భట్‌కు డబ్బింగ్ చెప్పిన సంగతి చాలా మందికి తెలియదు. మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా సూర్య, కార్తిలా ముద్దుల చెల్లెలు ప్రత్యేక రూట్లో రాణిస్తుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో మరో మణిరత్నంలో దూసుకుపోతుంది బృిందా.