సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో.. ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో.. ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ నటుడు కెరీర్ జర్నీ కూడా అలాగే కొనసాగింది. అతను యాక్షన్ సీన్స్‌కు కొత్త మెరుపులు దిద్దిన గొప్ప నటుడు. కెరీర్‌లో పిక్స్ లెవెల్లో సక్సెస్ అందుకున్నాడు. కానీ.. అతని కెరీర్‌లో ఎన్నో ప్లాపులు కూడా ఉన్నాయి. 22 ఏళ్లలో అతను సోలో హిట్ అందుకోవడంలో విఫలమౌతూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే 30 ఫ్లాప్‌లను మూట కట్టుకున్న. ఈ హీరోను దాదాపు అందరూ ఆడియన్స్ మర్చిపోయారు అనుకుంటున టైంలో.. ఆరుపదుల వయసులో ఒక క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసి నటించాడు.
ఇక ఈ సినిమాతో కెరీర్ మారిపోయింది. ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఇంతకీ హీరో ఎవరో చెప్పలేదు కదా.. ధర్మేంద్ర పెద్ద కొడుకు సన్ని డియోల్. 1987లో బేతాబ్ మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే సత్తా చాటుకుని భారీ బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకున్నాడు. తర్వాత ఎన్నో మర్చిపోలేని యాక్షన్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఆయన.. 1990లో గాయల్ సినిమాతో వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించి సక్సెస్లు అందుకున్న సన్నీ.. ఆఖరి సోలో హిట్ గాథర్.. ఏక్ ప్రేమ్ కదా. 2000లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
తర్వాత ఆయన నటించిన సోలో సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలుస్తూ వచ్చాయి. గాదర్ తర్వాత తను 22 ఏళ్ళ సినీ కెరీర్ 30 ఫ్లాపులను చూసాడు. ఈ క్రమంలోనే చాలా కాలం సినిమాలకు దూరమైన సన్నీ.. తన 66 ఏళ్ల వయసులో గాదర్.. ఏక్ ప్రేమ కథ సీక్వెల్ గాదర్ 2తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. పార్ట్ 1లోనే సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.686 కోట్ల వసూలు కొల్లగొట్టాడు. గాదర్2 ప్రస్తుతం సన్ని డియోల్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్ కొల్లగొట్టిన మూవీ. ఈ సినిమా తర్వాత భారీ ప్రాజెక్టులలో అవకాశాలు కొట్టేసి నటిస్తూ రాణిస్తున్నాడు. ఏడుపదుల వయసు దగ్గర పడుతున్నా.. అదే దూకుడుతో రాణిస్తున్నాడు. ఇక సన్నీ లహూెర్ 1947 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పలు కథనాల ప్రకారం.. సన్ని నికర ఆస్తులు ఏకంగా రూ.120 కోట్లు ఉన్నట్లు సమాచారం.