టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి బాలీవుడ్‌లో ఎలాంటి పేరు సంపాదించుకున్నాడో తెలిసిందే. కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సందీప్.. టేకింగ్ తో పాటు, స్క్రీన్ ప్రజెన్స్‌తోను బాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. దీంతో.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన సినిమాలకు భారీ వాసూళ్లు దక్కాయి. అయితే.. సందీప్‌పై అక్కడ ప్రొడక్షన్ హౌస్‌లే కాదు.. దర్శకులు కూడా తమ కడుపు మంటను చూపించారట. సందీప్ వాళ్లందరికీ స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాలీవుడ్‌పై మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో ప్రముఖులు యానిమల్ సినిమాను తిట్టారు. కానీ.. అందులో నటించిన హీరో రణ్‌బీర్ కపూర్‌ని మాత్రం విపరీతంగా పొగిడేస్తున్నారు.
ఆయన పాత్రను తెగ మేచుకున్నారు. సినిమా నచ్చని వాళ్లు రణబీర్ కపూర్‌ను ఎలా అభినందించారు.. ఇక్కడ రణ్‌బీర్ అంటే నాకు ఎలాంటి కోపం కాదు. కానీ.. వాళ్ళు చూపిన తేడా, వివక్ష ఏంటో నాకు ఆ టైంలో తెలియలేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. నన్ను తిట్టినట్లు.. రణ్‌బీర్‌ను టార్గెట్ చేస్తే ఏం జరుగుతుందో వాళ్లకు బాగా తెలుసు. అతడితో మరోసారి సినిమాలు చేయడం కుదరదు. ఇక నాపై ఈజీగా కామెంట్లు చేశారు. కారణం బాలీవుడ్కు నేను కొత్త. ఇక దర్శకుడు అంటారా.. రెండు, మూడేళ్ళకు ఓ సినిమా తీస్తాడు. కానీ.. నటుడు ఏడాదికి రెండు మూడు సార్లు అవసరం పడతాడు. నటుడితో ఎక్కువగా అవసరం ఉంటుంది.
కనుక వాళ్లు హీరోలను కానీ.. నటులను కానీ టక్కున ఏమీ అనలేరు అంటూ సందీప్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. ఇక అర్జున్ రెడ్డి రీమిక్స్‌లో షాహిద్ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు. కబీర్ సింగ్ సినిమాల్లో నటించిన ఓ యాక్టర్ ముంబైలోని పెద్ద ప్రొడక్షన్ హౌస్‌కు ఆడిషన్స్‌కు వెళ్ళాడని.. వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్పుకొచాడు. కేవలం నా సినిమాలో ఆయన నటించిన పాపానికే.. వాళ్ళు అతనిని రిజెక్ట్ చేశారని.. ఇంతటి వివక్ష బాలీవుడ్ లో మాత్రమే ఉందంటూ వెల్లడించాడు. ఇలాంటి నిర్ణయమే రణబీర్ సింగ్ విషయంలో తీసుకోండి అంటూ సవాల్ విసిరాడు.
ఈ విషయాన్ని రణబీర్ కపూర్ కి కూడా ఓ సారి చెప్పాను. వివిధ పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తూ ఇండస్ట్రీలో ఎదగాలని ప్రయత్నిస్తున్న యంగ్ టాలెంటెడ్ నటుడి పై.. నా సినిమాల్లో చేయడం వల్ల వివక్ష చూపడం చాలా బాధగా అనిపించిందని.. సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఒక యాక్టర్ టాలెంట్ కంటే.. తన గత సినిమా చూసి ప్రొడక్షన్ హౌస్ రిజెక్ట్ చేయడం ఎంత దుర్మార్గము దీన్ని బట్టి తెలుస్తుంది అంటూ వివరించాడు. కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ గురించే సందీప్ ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. కబీర్ సింగ్ సినిమాలో నటించిన షాహిద్ కపూర్.. ఈ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. తాజాగా జెర్సీ సినిమాతో మరోసారి తెరపై కనిపించాడు.