ప్రభాస్ పేరుతో ఒక ఊరే ఉందని తెలుసా.. ఏ దేశంలో అంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్, పాపులారిటీ పాన్ వరల్డ్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. బాహుబలి, సాహో, సాలార్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ పేరిట ఏకంగా ఓ గ్రామంలో ఉందన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. అయితే.. ఇది ఇండియా లోని ఊరు మాత్రం కాదు. పక్క దేశమైన నేపాల్ లో ఈ వూరు ఉండడం విశేషం.

ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్‌లో పర్యటిస్తున్న క్ర‌మంలో ఈ ఊరు పేరు చూసి ఆశ్చర్యపోయాడు. ఇక‌ ప్రభాస్ అని రాసి ఉన్న ఊరు పేరు.. వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నాడు. నేను నేపాల్ లో పర్యటిస్తున్న క్రమంలో ప్రభాస్ అనే ఊరిని చూసానని.. ప్రస్తుతం అదే ఊర్లో ఉన్నాను అంటూ ఆ నేమ్ బోర్డ్ తో సహా వీడియోని షేర్ చేసుకున్నాడు. తెలుగు వారికి ప్రభాస్ అనే పేరు వినగానే ఒక సరికొత్త వైబ్ క్రియేట్ అవుతుంది.

ఎప్పుడైనా ప్రభాస్ అనే పేరుపై ఉన్న విలేజ్‌ని చూసారా అంటూ అతను చెప్పుకొచ్చాడు. అయితే ఈ గ్రామానికి ప్రభాస్ అనే పేరు ఎందుకు వచ్చింది. దాని వెనుక స్టోరీ ఏంటనేది క్లియర్‌గా తెలియదు. కాగా ఈ విషయం ప్రస్తుతం నెటింట‌ తెగ వైరల్‌గా మారడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో పేరు ఒక ఊరికి ఉండడం వారికి ఫుల్ కిక్ ఇస్తుంది. ఇది నేపాల్‌లోనే ఓ చిన్న పట్నం మాత్రమే అయినా.. ప్రస్తుతం ఈ వార్త అభిమానులకు తెగ నచ్చేసింది. మరోవైపు నెటిజ‌న్స్ కూడా.. ప్రభాస్ అనే పేరు ఓ ఊరికి ఉందని తెలిసి ఆ ఊరి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను సెర్చ్ చేస్తున్నారు.