ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబో ఫిక్స్.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాక్..!

టాలీవుడ్‌లో నయా కాంబో వర్కౌట్ అవుతుంద‌నే టాక్ వైర‌ల్ అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఫిక్స్ అవ‌నుందని సమాచారం. ఇప్పటికే.. ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ది రాజా సాబ్‌ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. నెక్స్ట్ స్పిరిట్ సినిమాలో, తర్వాత హ‌నురాగపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. వీటితో పాటే కల్కి 2, సలార్ 2 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

Prabhas upcoming films: From Kalki 2898 AD to Hanu Raghavapudi directorial

ఇలాంటి క్రమంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ప్రభాస్ పని చేయబోతున్నాడన్న న్యూస్ నెటింట హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. త్వరలోనే ప్రభాస్ లుక్ టెస్ట్‌లో పాల్గొన‌న్నున్నారట. హనుమాన్‌తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. మొదట బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో బ్రహ్మరాక్షస అనే మైథలాజికల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా.. అది క్యాన్సిల్ అయింది. కాగా ఇదే మైథలాజికల్ కథను ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మలిచి.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.

Ranveer Singh's Brahmarakshasa Glimpse Loading - Telugu360

దీనిపై పూర్తి క్లారిటీ లేకున్నా.. ఒకవేళ ఈ కాంబో నిజంగానే ఫిక్స్ అయితే మాత్రం.. సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత సమయం పడుతుందనడంలో సందేహాం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ ప్రాజెక్టులతో.. ప్ర‌భాస్‌.. ప్రశాంత్ వర్మ సినిమాను కూడా చేస్తే అభిమానులకు అది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అవుతుంది. మరి ప్రభాస్ ఏం చేయబోతున్నారు.. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో.. తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి. అయితే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఎంత బిజీగా ఉన్నా కన్నప్పలో రుద్రగా గెస్ట్ రోల్ లో నటించేందుకు ఇష్టపడ్డారు. మంచి విష్ణు ప్రధాన పాత్రలో దొరకై సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్గా రిలీజ్ కానుంది.