టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే లిస్ట్‌లో మొదట నాచురల్ స్టార్ నాని పేరు, తర్వాత అక్కినేని చైతన్య పేరు వినిపిస్తుంది. ఇక నేచురల్ స్టార్ నాని పక్కింటి కుర్రాడు తరహా పాత్రలో ఎంచుకుంటూ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. వైవిధ్యమైన కథలతో తన మార్కెట్ను మరింతగా పెంచుకుంటూ వస్తున్నాడు. నాగచైతన్యకు టాలీవుడ్ లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. ఇలాంటి నేపధ్యంలో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలతో.. మల్టీ స్టారర్ తెరకెక్కిస్తే బిజినెస్ పరంగా వేరే లెవెల్‌లో ఉంటుంది కదా.. మరి ఇలాంటి క్రేజీ కాంబోలో.. మల్టీ స్టారర్ సినిమాలను తెరకెక్కించేందుకు ఎవరు ప్రయత్నించడం లేదేంటి.. అనే సందేహాలు అందరిలోనూ మొదలవుతాయి.
అయితే నాగచైతన్య, నాని కాంబినేషన్లో మాత్రం గతంలో మల్టిస్టారర్‌ని ప్లాన్ చేశారట మేకర్స్. కానీ.. కొన్ని అనివార్య కారణాలతో సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆగిపోయిందని టాక్. అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో నాగచైతన్య, సునీల్ కాంబోలో తడాకా సినిమా తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల, కాటమరాయుడు లాంటి హిట్ సినిమాల డైరెక్టర్ డాలి ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించాడు. తమిళ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సునీల్ పాత్ర కోసం మొదటి నాచురల్ స్టార్ నాని అయితే బాగుంటుందని భావించారట. ఇక నానికి అప్పటికీ స్టార్ హీరో స్టేటస్ రాలేదు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న టైం. దీంతో నాని కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
కానీ.. డేట్స్ క్లాష్ కారణంగా ఆయన నటించలేకపోయాడు. ఈ క్రమంలోనే సినిమా కోసం సునీల్‌ను సంప్రదించడం.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. వీరిద్దరు కాంబోలో సినిమా తెరపైకి రావడం జరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ అమాయకత్వంతో కనిపిస్తూంది. అయితే కథ మధ్యలో జరిగే కొన్ని సంఘటనలు కారణంగా ఆయన మోస్ట్ వైలెంట్ పోలీస్ గా మారిపోతాడు. తన పాత్రకు ఎన్నో ఎలివేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ నాని అదే క్యారెక్టర్ లో నటించి ఉంటే.. పర్ఫెక్ట్ మల్టీ స్టారర్ సినిమా అయి ఉండేది. బాక్సాఫీస్ దగ్గర మరో రేంజ్ లో సక్సెస్ అందుకునే ఉండేది. అయితే ప్రస్తుతం ఇలాంటి ఒక క్రేజీ బ్లాక్ బస్టర్ కాంబో మిస్ అయిందని తెలిసి.. ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాని, నాగచైతన్య మార్కెట్ ఇంచుమించు సమానంగానే ఉంది. ఓవర్సీస్ లో అయితే నాని స్టార్ రేంజ్‌లో ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. ఇప్పటికైనా వీళ్ళిద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ వస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు కొల్లగొడుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.