భార్యతో విడాకులపై ఆది పినిశెట్టి రియాక్షన్ ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఈ క్రమంలోనే సెలబ్రెటీస్‌కు అసలు ప్రైవసీ అన్నదే ఉండడం లేదు. వారికి సంబంధించిన వార్త బయటకు వచ్చినా.. అది నిజమా, అబద్దమో తెలియక ముందే ప్రపంచమంత వైరల్ గా మారిపోతుంది. పెళ్లి కానీ సెలబ్రిటీస్.. ఎవరితోనైనా కనిపిస్తే వారిద్దరికీ పెళ్లి వార్తలు, పెళ్లి అయిన వారు కలిసి కొంతకాలం కనిపించకపోతే వారికి డివోర్స్ వార్తలు, రూమర్లు ఎన్నో పుట్టుకొచ్చేస్తున్నాయి. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆది పినిశెట్టి తన భార్యకు విడాకులు ఇచ్చాడంటూ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలపై హీరో ఆది పినిశెట్టి తాజాగా రియాక్ట్ అయ్యారు.

Aadhi Pinisetty Shares Photos From His Engagement Ceremony With Nikki  Galrani, Says, 'It's Official'

ఆది తాజాగా నటించిన మూవీ శ‌బ్ధం.. హరివల్లగన్ వెంకటాచలం డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న‌ రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ప్రమోషన్స్‌లో ఆది ఎన్నో ఇంట‌ర్వ్యూల‌లో సందడి చేస్తున్నాడు. సినిమా విషయాలతో పాటు.. పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఇక అది హీరోయిన్ నిక్కీ గ‌ల్రానీని 2002లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే ప్రేమాయణం నడిపిన ఈ జంట.. పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తయని, త్వరలోనే డివోర్స్ తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. దానిపై.. ఆది ని ప్రశ్నించగా ఆది మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే సినిమాల్లో ఉండి, చాలా క్యారెక్టర్స్ చేసి సెన్సిటివ్ గా ఉండకూడదని ఫిక్స్ అయ్యా. ఎక్కువగా ధైర్యంగా ఉండడం నేర్చుకున్నా.

Hero Aadhi Pinisetty Speech at Sabdham Movie Pre Release Event | Nani |  Silver Screen - YouTube

రిజెక్షన్స్ అనేవి కామన్. మన 250 మందితో రోజు పనిచేస్తాం. అందరూ మర్యాద ఇవ్వాలని లేదు.. కొంతమంది మొఖం పైనే తిట్టిపోతే.. కొంతమంది వెనుకకు వెళ్లి మాట్లాడుకుంటారు. అలాంటివి విన్నప్పుడు మనలో ఇంకా ధైర్యం పెరగాలి.. ఇక విడాకుల గురించి ఒక థంబ్‌నెయిల్ చూసి నేను షాక్ అయ్యా. ఆ వీడియో పెట్టిన వాళ్ల గురించి కంటే ముందు.. ఎలాంటి వీడియోలు చేశారనేది చూశా. అది చూశాక అతని గురించి కానీ.. ఆ విషయం గురించి కానీ.. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది.

Sabdham (2025) - IMDb

ఒకవేళ మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమన్నా ఉందనుకుంటే.. రాసినా కూడా ఓకే. కానీ.. ఏమీ లేనప్పుడు రెండు ఫోటోలు పెట్టి అలాంటి వార్త చెప్పేసినంత మాత్రాన.. నిజమైపోదు. ఇలాంటి వాళ్ల గురించి పట్టించుకోనవసరం లేదు. వాళ్ళు తమ లైఫ్ అలా కొనసాగించేస్తున్నారు అనుకోవడమే. అయితే.. ఇవి కాకుండా క్రిటిక్స్, నెగటివ్ క్రిటిక్స్, పాజిటివ్ క్రిటిక్స్ నుంచి మాత్రం నేను ఏదైనా నేర్చుకోవచ్చని ఆలోచిస్తా. ఇలాంటి విషయాల్లో ఎంత వదిలేస్తే అంత మంచిది. కానీ.. నా డివోర్స్ న్యూస్ చూసి కాస్త బాధపడ్డ. కొన్ని నిమిషాల తర్వాత దాన్ని వదిలేసా అంటూ వివరించాడు. మేమిద్దరం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆది పినిశెట్టి కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.