టాలీవుడ్ లో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దుబాయిలో జరుగుతున్న ఈవెంట్లో నిర్మాత కేదర్. సెలగంశెట్టి.. హఠాత్ మరణం చెందారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గంగంగణేష సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన కేదార్.. మరికొన్ని సినిమాలకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన హఠాత్ మరణం చెందడం టాలీవుడ్ లో విషాదం నెలకొంది.
ఇక గతంలో కేదార్ రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఈ క్రమంలోనే మృతికి డ్రగ్స్ కారణమూ అయి ఉండొచ్చని టాక్ నడిచింది. కాని ఆయన గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. దుబాయ్ అధికారులు కేదర్ చనిపోయిన విషయాని అఫీషియల్‌గా ప్రకటించారు. టాలీవుడ్‌లో కేదర్‌కి చాలామంది సన్నిహితులు ఉన్నారు. వారిలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు కావడం విశేషం. అల్లు అర్జున్ ఇన్సపిరేషన్‌తోనే కేదార్ ప్రొడ్యూసర్ గా మారినట్లు సమాచారం.
ఇక విజయ్ దేవరకొండ, బన్నీ వాస్ తోను కేదర్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో గంగం గణేశా సినిమాకు ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు కేదర్. ఇక సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబోలోను సినిమా కోసం కేదార్ ప్రొడ్యూసర్ గా ప్లాన్ చేస్తున్నాడు. కానీ.. అది కార్యరూపం దాల్చకముందే ఆయన మరణ వార్త వినిపించడం.. సన్నిహితులు, స్నేహితులను కలచివేస్తుంది. ఈ క్రమంలోనే కేదర్‌కు సంతాపం తెలియజేశారు.