TJ రివ్యూ : మ‌జాకా.. సందీప్ కిషన్ హిట్ కొట్టాడా..?

టైటిల్‌: మ‌జాకా
నటీనటులు: సందీప్ కిషన్, రీతు వర్మ , అన్షు మాలిక, రావు రమేష్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
కథ, స్క్రీన్ ప్లే: ప్రజల కుమార్ బెజవాడ, సాయికృష్ణ
మ్యూజిక్: లియాన్ జేమ్స్
ప్రొడ్యూసర్: రాజేష్ దండ
డైరెక్షన్: త్రినాధరావు నక్కిన
సెన్సార్ రిపోర్ట్:యూ/ఏ
రన్ టైం: 2:08
రిలీజ్ డేట్: 26-2-2025

ప‌రిచ‌యం:
టాలీవుడ్ క్రేజీ హీరో సందీప్ కిషన్ తాజా మూవీ మజాకా. త‌న‌ 30వ సినిమాగా.. విజయవంతమైన ధమాకా తర్వాత.. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో.. రావు రమేష్, అన్షు మాలిక, రీతు వర్మ, మురళి శర్మ, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక‌ ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే కొద్ది గంటల క్రితం శివరాత్రి సందర్భంగా రిలీజ్ అనే సినిమా ఆడియన్స్‌ని ఎలా మెప్పించిందో.. సందీప్ కిషన్ హిట్ కొట్టాడా.. లేదా.. రివ్యూలో చూద్దాం.

క‌థ‌:
కృష్ణ (సందీప్ కిషన్), వెంకటరమణ (రావు రమేష్) తండ్రి కొడుకులుగా ఆడదిక్కు లేకపోవడంతో ఇద్దరూ ఒకరి బాగోగులు ఒకరు చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తారు. ఎలాగైనా కొడుకుకి పెళ్లి చేసి.. ఇంట్లో ఫ్యామిలీ ఫోటోని చూసుకోవాలన్నది వెంకటరమణ కల‌. కానీ.. ఎవరు అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడరు. వెంకటరమణ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయని కొందరు సలహా ఇస్తారు. ఈ క్రమంలోనే లేటు వయసులో వెంకటరమణ ప్రేమలో పడతాడు. మరో పక్క.. కొడుకు కృష్ణ కూడా మీరా, రీతు వర్మ ప్రేమలో ఉంటాడు. అలా.. తండ్రి కొడుకులు ఇద్దరు ఎవరికివారు ప్రేమలేఖలు రాస్తూ బస్టాప్‌ల చుట్టు తిరుగుతూ బిజీగా ఉంటారు. ఇక ఒకరి ప్రేమ గురించి మరొకరికి ఈ తండ్రి కొడుకులకు ఎప్పుడు తెలుస్తుంది..? వీళ్ళ ప్రేమ కథలు ఎలాంటి చిక్కులు ఏర్పడ్డాయి..? ఎన్ని మలుపులు చోటు చేసుకున్నాయి..? పగ‌తో రగిలిపోయే భార్గవ్ వర్మ (మురళీ శర్మ)కి.. ఈ తండ్రికొడుకులకు మధ్య రిలేషన్ ఏంటి..? అనేదే తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

मज़ाका टीज़र: राव रमेश और संदीप किशन का मज़ेदार अवतार मज़ेदार है

TJవిశ్లేష‌ణ & డైరెక్ష‌న్
సినిమా కథను ఓవర్ ది బోర్డ్ తరహా సీన్స్‌ చూస్తూ ఎంజాయ్ చేసే ఆడియ‌న్స్‌ ఉంటారు. అలాంటి వారిని సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. రాత్రులు కూర్చుని.. తండ్రి కొడుకులు పోటీపడి ప్రేమలేఖలు రాయడం, ఇద్దరు తాము మనసిచ్చిన వాళ్ళ కోసం గోడలు దూకడం, బస్టాండ్‌లో బస్సుల వెనక ఫాలో కావడం ఇలాంటి సన్నివేశాల్లో కామెడీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ కు నచ్చినా.. మరో పక్క టూ మచ్ అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఫాదర్ లవ్ స్టోరీ లో సాగే సన్నివేశాలు అదే తరహాలో ఉంటాయి. వాటన్నింటినీ కధలో లాజిక్స్ వెతక కుండా చూస్తే.. ఎంజాయ్ చేయవచ్చు. ఇటీవల కాలంలో ఆడియన్స్‌ను నవ్వించేందుకు అడల్ట్ కామెడీ సీన్స్‌ను, డబల్ మీనింగ్ డైలాగ్లను ఎక్కువగా చూస్తున్నాం. ఈ సినిమాలో అలాంటి ఇబ్బంది కర డైలాగులు ఏమీ లేవు. ఇంటిలిపాది చూసి ఎంజాయ్ చేసే స్వచ్ఛమైన స్టోరి అనిపిస్తుంది.

ఇక డైరెక్టర్.. తండ్రి, కొడుకుల ఇద్దరు లవ్ స్టోరీని సమాంతరంగా చూపిస్తూ ఫస్ట్ హాఫ్ ను కొనసాగించాడు. ఒకరి ప్రేమ కథ మరొకరికి తెలిసిపోవడం తర్వాత వచ్చే ప్రేమ లేఖలు ఎపిసోడ్లు.. ఇక భార్గవ్ వర్మ.. ఈ తండ్రి కొడుకులు పై ప్రతీకారం నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే కథలో పెద్దగా ఎక్సైట్మెంట్ ఉండదు. కదా, కథనాలు ఆడియన్స్ ఊహలకు త‌గ్గ‌టూ ఉన్నాయి. స్టోరీలో కొత్తదనం లేకపోవడం కాస్త ల్యాగ్‌ అనిపించినా.. సినిమా మాత్రం టైం పాస్ మూవీ. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌లో కొంత ఆసక్తి కల్పిస్తాయి. సెకండ్ హాఫ్ అందరి అంచనాలకు భిన్నంగా ఉంటుంది. కథలో కొత్త కోణం బయటపడుతుంది. అక్కడి నుంచి దాని చుట్టూ సీన్స్ అన్నీ తిరుగుతాయి. అనకాపల్లి పెళ్లి ఎపిసోడ్ బ్లాక్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథలో కామెడీనే కాదు, ఎమోషన్స్ కూడా చూపించారు. క్లైమాక్స్‌లో వాటిపై దృష్టి సారించారు. తండ్రి కొడుకుల బంధం, హీరోయిన్ల ఎపిసోడ్లలో మరింత డెప్త్ చూపించి.. ఎమోషన్స్ ను పండించే ఆస్కారం స్టోరీలో ఉన్న డైరెక్టర్ ఆలోచించలేదేమో అనిపిస్తుంది. అలా కొన్ని ఎమోషన్స్‌ని కూడా కామెడీలా పండించేందుకు ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఇక స్టోరీని ఎండ్‌ చేసినా తీరు.. ఆకట్టుకుంటుంది.

संदीप किशन की फिल्म 'मजाका' की रिलीज डेट टली

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య బాండింగ్ సినిమాలో చాలా స్పెషల్. ఇద్దరు తండ్రి కొడుకులు గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హుషారైన నటనతో సందీప్ కిషన్ పక్కింటి కుర్రాడు తరహా పాత్రలో మెప్పించాడు. కామెడీ పరంగా సరైన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. లేటు వయసులో ప్రేమలో పడిన వ్యక్తిగా రావు రమేష్ 100% ఇచ్చాడు. అయితే ఆయన ప్రేమ లేఖలు పట్టుకుని హీరోయిన్ చుట్టూ తిరగడం పెద్దగా అతికినట్టు లేదు. మురళి శర్మ రోల్‌ డిజైన్ చేసిన తీరు.. ఆయన నటన ఈ సినిమాకు హైలైట్. రీతు వర్మ, అన్షు కీలకపాత్రలో మెప్పించారు. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది అక్కడక్కడ తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. సాంగ్స్ ఆకట్టుకున్నాయి. కానీ.. సందర్భానుసారం సాంగ్స్ కుదరలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. త్రినాథ్ రెడ్డి నెక్కిన అలవాటైన జానరే అయినా ఇది కథపరంగా మరింత దృష్టిపెట్టి ఉంటే.. రిజల్ట్ ఇంకా బాగుండేది అనిపించింది. డైలాగ్స్ మెప్పించాయి.

Mazaka teaser: Rao Ramesh and Sundeep Kishan's fun avatars are hilarious

ప్ల‌స్ పాయింట్స్ ( + ) :
కామెడీ, సెకండ్ హాఫ్ ట్విస్ట్‌లు, క్లైమాక్స్ సీన్స్

మైన‌స్ పాయింట్స్ ( – ) :
ప్రేక్షకుడి ఊహించిన విధంగానే కథ ఉంది, అక్కడక్కడ సహజత్వం లోపించింది.

ఫైన‌ల్‌గా : కామెడీ పరంగా మజాకా ఆకట్టుకుంటుంది.