పెళ్లయిన రెండు నెలలకే భర్తకు కీర్తి బిగ్ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ఇటీవ‌ల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. గత ఏడాది డిసెంబర్ 12న అతి కొద్ది మంది సమక్షంలో ప్రియుడు ఆంటోనీని వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ.. మహానటి కీర్తి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచి.. ఈ లవ్ స్టోరీ నడుస్తుందని.. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా మారినా కూడా.. ఆ ప్రేమను కొనసాగించినట్లు వివరించింది. తమ ప్రేమను ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి మార్చుకుంది. కొద్దిరోజుల క్రితం ప్రేమను ఆంటోనీతో కలిసి కన్ఫామ్ చేసిన ఈ అమ్మడు.. గోవాలో గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. ఇక తన పెళ్లికి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి ఆమె చూసుకోవడం విశేషం.

కొత్త జంట.. కలర్ ఫుల్ అంట..! | Keerthy Suresh Shares Wedding Moments,  What's Next for Her Career After Marriage?

మొదట హిందూ సంప్రదాయం ప్రకారం.. తర్వాత భర్త ఆంటోనీ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం.. వీళ్లిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా కీర్తి భర్తకు లిప్ లాక్ ఇచ్చిన పిక్ నెటింట‌ తెగ వైరల్‌గా మారింది. ఇక‌ పెళ్లి సంద‌డి ముగిసిన తర్వాత కీర్తి సురేష్ ప‌లు సినిమా షూట్స్ లో.. ఈవెంట్ లో బిజీగా మారింది. ఇక కీర్తి సురేష్ గతేడాది బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరో వరుణ్ దావ‌న్‌తో కలిసి నటించిన బేబీ జాన్ సినిమా గ‌తేడాది చివర్లో రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కీర్తి సురేష్ కు బాలీవుడ్ లో నిరాశ‌ తప్పులేదు. అయితే పెళ్లి తర్వాత కొన్ని ఈవెంట్‌ల‌లోను తాళిబొట్టుతో మెరిసిన ఈ అమ్మడు.. మోడరన్ డ్రెస్‌లోను తాళిబొట్టు ధరించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది.

Keerthi Suresh: వైరల్‌గా కీర్తి సురేష్ సంగీత్ ఫొటోలు.. ఇదేం సెలక్షన్ రా  బాబు అంటున్న నెటిజన్లు

తను మోడల్ అమ్మాయి అయినా.. తాళిబొట్టును గౌరవించడం ఎంతోమందిని మెప్పించింది. అయితే ఇప్పుడు మెడలో తాళిబొట్టు లేకుండా దర్శనమిచ్చింది కీర్తి. ఈ మధ్య భార్తతో కలిసి చేసిన ఫోటోషూట్‌ను తను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మొత్తం ఫోటోలో కీర్తి మెడలో తాళి లేకపోవడం అందరికి షాక్ ఇచ్చింది. దీంతో నెటిజ‌న్స్ ఆమెపై మండిపడుతున్నారు. రెండు నెలలకే మెడలో తాళి తీసేసావా.. అంత బరువైందా అంటూ.. తాళిని ఎంతగానో రెస్పెక్ట్ ఇస్తావ్ అనుకున్నా.. నువ్వు కూడా అందరిలానే ఉన్నావ్‌ అంటూ.. రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు చేస్తూ ట్రోల్స్ కురిపిస్తున్నారు. వీటిపై కీర్తి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.