ప్రభాస్ ఫౌజీలో సాయి పల్లవి.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజా మూవీ తండేల్‌తో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌నుంది. ఈ నేల 7న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డి నెక్స్ట్ తెలుగు సినిమా ఏదై ఉంటుంద‌నే ఆశ‌క్తి ఆడియ‌న్స్‌లో నెల‌కొంది. ఇక ప్ర‌స్తుతం తండేల్‌తో పాటు.. బాలీవుడ్‌లో రామాయ‌ణం పార్ట్ 1, ఏక్‌దిన్ సినిమాల‌తో బిజి బిజీగా గ‌డుపుతుంది. ఈ క్ర‌మంలోనే సినిమాల ఎంపిక‌ల విష‌యంలో అచితూచి అడుగులు వేసే సాయిప‌ల్ల‌వి.. తెలుగు సినిమాల స్క్రిప్ట్ చాలా శ్ర‌ద్ధ వ‌హిస్తుంది.ఈ క్రమంలోనే అమ్మడి నెక్స్ట్ మూవీ పై అదిరిపోయే అప్డేట్ వైరల్‌గా మారుతుంది.

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించ‌నున్న‌ నెక్స్ట్ మూవీ ఫౌజి. హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. స్వతంత్రోద్యమం కాలం నాటి ఓయోధుడి ప్రేమ‌ కథ‌గా ఈ సినిమా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా ఇమన్వి మెరవనుంది. ఇక క‌థ‌కు తగ్గట్టుగానే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా కథకు ఆయువుపట్టుగా ఉండనుంద‌ని సమాచారం. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రభాస్ లవర్‌గా సాయి పల్లవి కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఆమెను ఈ పాత్ర కోసం ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తుంది.

Prabhas' film with Hanu Raghavapudi kick-starts with a pooja ceremony - The  Hindu

ఈ వార్తల్లో వాస్తవం ఏంటో తెలియదు కానీ.. నిజంగానే సాయి పల్లవి సినిమాలో నటిస్తే మాత్రం ఆడియన్స్‌లో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొంటాయ‌న‌డంలో సందేహం లేదు. అంతే కాదు ప్రభాస్ లాంటి స్టార్ హీరో సర్చన సాయి పల్లవి అంటే అమ్మడి ఇమేజ్ మరింతగా పెరుగుతుంది. ఇక గతంలో ప్రభాస్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయి పల్లవి తో నటించాలని ఉందంటూ వెల్లడించాడు. కానీ హైట్ ప్రాబ్లం వల్ల ఆమెతో ఇప్పటివరకు నటించలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా క‌చ్చితంగా రావాలంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.