టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న తారక్.. బాలీవుడ్‌లో వార్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాలో కనిపించనున్నాడు తారక్. అలాగే రజనీకాంత్‌కు జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నెల్సన్ దిలీప్‌తోను తారక్ మరో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న తారక్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ స్టార్ హీరోల కంటే.. ఆయన చాలా భిన్నంగా ఉంటారని.. అభిమానులను ఎంతగానో ప్రేమిస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభిమానుల ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే.. తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ వారి క్షేమం కోసం మరో పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు తారక్. తనని కలుసుకోవడం కోసం అభిమానులు ఎవరు పాదయాత్రలు చేయవద్దంటూ చెప్పుకొచ్చాడు.
స్టార్ హీరోగా ఎన్టీఆర్ అభిమానుల ఆనందమే కాదు.. వాళ్ళ క్షేమం కూడా నాకు చాలా ముఖ్యమంటూ మంగళవారం అఫీషియల్ గా ఓ ప్రకటనను రిలీజ్ చేశాడు. మీ అందరిని కలుసుకునేందుకు త్వరలోనే అన్ని అనుమతులతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అంత సిద్ధమవుతుందని.. అందుకు కొంత సమయం పడుతుంది చెప్పుకొచ్చాడు తారక్. ఇక అప్పటివరకు అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుకున్నాడు. దయచేసి నాపై అభిమానంతో కష్టపడకుండా.. ఓర్పుతో వేచి చూడాలంటూ తారక్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.