SSMB 29 విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ బ్యూటీ.. జక్కన్న ఊర మాస్ నాటు ప్లానింగ్..!

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజియ‌స్‌ మూవీగా SSMB 29 సెట్స్‌పైకి రానుంది. రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న ఈ సినిమా మ‌హేష్‌ 29వ సినిమాగా తెర‌కెక్కనుంది. ఇక ఈ మూవీ మహేష్ కెరీర్‌లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనుంద‌ని టాక్‌. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేక‌ర్స్‌. కాగా జనవరి 2న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. కాగా ఈ సినిమా కాస్టింగ్ పై డైరెక్టర్ రాజమౌళి శ్రద్ధ తీసుకున్నారు.

ఈ సినిమాలో మహేష్‌తో పాటు.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు వినిపించినా.. ఆయన అదేమీ లేదని క్లారిటీ ఇచ్చేసాడు. ఇక మహేష్ స‌ర‌సన హీరోయిన్గా బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాను తీసుకున్నారు అని టాక్ తెగ వైరల్ గా మారింది. దానికి త‌గ్గ‌ట్టే.. రాజమౌళి, కీరవాణితో.. ప్రియాంక దిగిన ఫోటోస్‌ నెట్టింట వైరల్ గా మారడంతో.. అదే నిజమని అభిమానులంతా ఫిక్స్ అయ్యారు. అయితే జక్కన్న ఊర మాస్ ప్లానింగ్ అభిమానుల అంచనాలకు అందడం అసాధారణం.

Priyanka Chopra - Wikipedia

ఈ క్రమంలోని తాజాగా జక్కన్న మాస్టర్ ప్లాన్ వేరే ఉందంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.ఇంతకీ జక్కన్న ఊర మాస్ నాటు ప్లాన్ ఏంటంటే.. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదట‌. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా ఈ సినిమాలో లేడీ విలన్ గా కనిపించనుందట. దానికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారని.. ఈ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు పరిశీలిస్తున్నారని యూనిట్ వర్గాలు సమాచారం. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.. ఈ పాన్ ఇండియా సినిమాల్లో భాగం చేయడానికి సంప్రదింపులు చేస్తున్నారట టీం.