పొదలచాటుకు లాక్కెళ్ళి రేప్ చేశాడు.. టాలీవుడ్ స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

ఇటీవల కాలంలో చాలామంది అమ్మాయిలు మగవారి డ్రస్సింగ్ స్టైల్‌తో.. వారిలా బిహేవ్ చేస్తూ మగవాళ్ళలా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి వాళ్లు ఆడవాళ్ళైనా మగవాళ్ళులా ఉంటున్నారు. అలా.. ఇండస్ట్రీలోను కొంతమంది నటీమణులు చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో.. టాలీవుడ్ స్టార్ బ్యూటి స్నిగ్ధ‌ కూడా ఒకటి. ఈమె అమ్మాయి అయినా.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి.. ఇప్పటివరకు పూర్తిగా అబ్బాయిలాగే డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ తో బిహేవియర్‌ని కూడా అలాగే ఫాలో అవుతూ వస్తుంది. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన నటనత ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే క్షణం, జత కలిసే, గుంటూరు టాకీస్, విజేత, టైగర్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, మేం వయసుకు వచ్చాం ఇలాంటి ఎన్నో మంచి సినిమాలో నటించి ఆకట్టుకుంది.

Snigdha: అందుకే పెళ్లి చేసుకోవడం లేదు.. అసలు విషయం చెప్పిన నటి స్నిగ్ధ -  Telugu News | Actress Snigdha revealed why she is not getting married | TV9  Telugu

తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న స్నిగ్ధ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. తన లైఫ్ లో జరిగిన కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. తన లైఫ్ లో ఉన్న ఫ్రెండ్స్ కూడా పూర్తిగా మగవాడిలా ఉండిపోవాలనుకుంటున్నావా అని చాలాసార్లు అడిగారని.. నాకు సినిమాల్లో వచ్చే ఆఫర్స్ కూడా అలానే వస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు నన్ను చూసిన వారంతా నిజంగానే అబ్బాయిని అనుకుంటారని చెప్పుకొచ్చింది.

Actress Snigdha: ఇందిరా పార్కులో ఒకడు లాక్కెళ్లాడు.. చేదు అనుభవాలను  పంచుకున్న నటి..

ఈ క్రమంలోనే తనకు చిన్నప్పుడు జరిగిన ఒక బాధాకర ఘటన గురించి ఆమె షేర్ చేసుకుంది. నేను ఐదో తరగతి చదువుతున్న టైం లోనే ఇందిరా పార్కులో ఆడుకుంటున్నానని.. ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి నన్ను పొద‌ల‌చాటుకు లాక్కెళ్లి రేప్ చేయడానికి ప్రయత్నించాడు.. ఆ సంఘటన నుంచి బయటపడడానికి నాకు దాదాపు పది నుంచి 12 ఏళ్ళు పట్టిందంటూ వెల్లడించింది. అప్పటినుంచి నా పక్కన నాన్న, మామ.. ఎవరు మగవాళ్ళు ఉన్నా కూడా ఎంతో భయం వేస్తుంది అంటూ ఎమోషనల్ అయినా స్నిగ్ధ‌.. మానసికంగా చాలా డిప్రెషన్కు గురయ్యానని చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఎదురైన విషయాల గురించి స్వ‌యంగా ఆమె చెప్పడంతో ఆమె చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.