ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక వేడుకగా ప్రయోగారాజ్ మహాకుంభమేళా.. ప్రస్తుతం అప్రతిహతంగా కొనసాగుతున్న సంగతి తెలుస్తుంది. ఈ నేపద్యంలోనే.. దేశ, విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు ఈ వేడుకకు తరలివస్తున్నారు. భక్తిశ్రద్ధలతో త్రివేణి సంగమ పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. ఇక సాధారణ ప్రజలతో పాటు.. సినీ , క్రీడా, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది ప్రయాగాకు తరలి వెళ్లడం విశేషం. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు బుల్లితెర సెలబ్స్.. ప్రయోగరాజ్ కుంభమేళకు తరలిరావడం ప్రస్తుతం వైరల్‌గా మారుతుంది.
సంయుక్త మీనన్, పూనమ్ పాండే, యాంకర్ లాస్య, పవిత్ర గౌడ ఇలా ఎంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతేకాదు తమ యాత్రను, భావాలను సోషల్ మీడియా ద్వారా అందరితోను పంచుకున్నారు. తాజాగా పాన్ ఇండియా హీరోయిన్ కేజిఎఫ్ ఫేమ్.. శ్రీనిధి శెట్టి మహాకుంభమేళలో మెరవడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించింది. తండ్రితో కలిసి ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్న శ్రీనిధి.. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా సామాన్య భక్తురాలుగా మారి అక్కడి స్నానాలు ఆచరించింది. అనంతరం ఈ కుంభమేళ యాత్రకు సంబంధించిన ఫోటోలు, విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
నిజంగా ప్రయాగరాజ్ నన్ను పిలిచినట్లు అనిపించింది.. మొదట్లో నాకున్న పనుల బిజీ కారణంగా ఇక్కడికి రావడానికి కుదరదేమో అనుకున్న. కానీ.. సడన్గా ఏమైందో ఏమో నా పనులన్నీ పక్కన పెట్టేసి మరి టికెట్ బుక్ చేసుకున్నా. దానికి ప్రధాన కారణం మా నాన్న. చివరి నిమిషంలో మనం కుంభమేళకు వెళ్తున్నామంటూ నాకు సర్ప్రైజ్ ఇవ్వడమే.. ఇది నిజంగా మన లైఫ్ లో ఒకసారి జరిగేది.. వచ్చేది.. కనుక ఎలాంటి ప్రశ్నలు, డౌట్‌లు అడగలేదు. వెంటనే నాన్నకు ఓకే చెప్పేసా. ప్రస్తుతం నేను కుంభమేళలోనే ఉన్నా.. ఇక్కడ ఎదురైన ఒక్కో అనుభవం.. లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుందంటూ రాసుకొచ్చింది శ్రీనిధి శెట్టి.