నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. ఈనెల 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్‌లోనే ఒకింత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కార్తికేయ 2 ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. ప్రమోషన్స్ భారీ లెవెల్‌లో చేపట్టారు మేకర్స్. ఇప్పటికే ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవెల్లో నిర్వహించిన యూనిట్.. ఇప్పుడు మరింత వేగవంతం చేసి ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఏదేమైనా చైతన్య తనదైన రీతిలో సత్తా చాటేందుకు.. సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇప్పటివరకు పలు సినిమాలో నటించిన అయన.. స్టార్ హీరో స్టేటస్ అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తండేల్ సినిమాలో ఆఫర్ కొట్టేసిన చైతు.. సినిమాతో ఎలాగైనా తనను తాను ప్రూఫ్ చేసుకోవాలని.. మాస్ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరో రేంజ్ టచ్ చేయాలని ఆరాటపడుతున్నాడు.
ఇలాంటి క్రమంలో తండేల్ సినిమాతో చైతుకి సక్సెస్ వస్తే మాత్రం.. ఇక ఆయన స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగిపోతాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ తండేల్ సినిమాను.. ఓ వర్జినల్ స్టోరీ ఆధారంగా రూపొందించిన సంగతి తెలిసిందే. నిజమైన తండేల్ రామారావు ఓ చేపలు పట్టే వ్యక్తి. అతను చేపలు పట్టడానికి వెళ్లి పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోవడంతో అక్కడ 17 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. మొత్తానికి టీం మొత్తంతో కలిసి చివరకు ఎలాగో ఇండియాకు చేరుకున్నారు. అది నిజంగానే గొప్ప అచీవ్మెంట్‌గా మారింది. మరి ఈ గొప్ప సగంఘటనలను.. వారు పాకిస్తాన్ పోలీసులకు చిక్కుకున్న తర్వాత అక్కడ ఎదుర్కొన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.
నాగచైతన్య నిజజీవితంలో తండేల్ రామారావు పోషించిన పాత్రను.. కొద్దిపాటి మార్పులతో తండేల్ రాజుగా చూపించమన్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే మంచి హైప్ నెలకొంది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాకు.. ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతాడని సమాచారం. అయితే ఈ కథను నిజమైన తండేల్ రామారావు దగ్గర నుంచి మేకర్స్ తీసుకున్నందుకుగాను.. రూ.2 లక్షల రెమ్యూనరేషన్ అతనికి ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా తండేల్ రామారావు తన కథని స్క్రీన్ మీద తను చూసుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను అంటూ రీసెంట్గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. ఏదేమైనా ఈ వ్యక్తి నిజ జీవిత కథ వెండితెరపై సక్సెస్ అయితే మాత్రం.. అటు చైతుకి, ఇటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్కు తిరుగులేని బూస్టప్ వస్తుందన్నడంలో సందేహం లేదు.