తండేల్ మూవీ ఈ ఆరు సీన్లు హైలెట్.. ఆడియన్స్ కు పూనకాలే..!

అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తాజా మూవీ తండేల్. ఈనెల 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్నారు టీం. ఇక చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై చైతుతో పాటు.. పూర్తి మూవీ టీమంతా పూర్తి నమ్మకంతో ఉన్నారు. సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టే సినిమాపై ఆడియన్స్‌లోను హైప్ నెలకొంది. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. అన్ని భాషల్లో విపరీతమైన బజ్‌ నెలకొంది. ఈ క్రమంలోనే.. అక్కినేని ఫ్యాన్స్ అంత సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సినిమా ఇన్‌సైడ్ వర్గాల టాక్‌ నెట్టింట వైరల్‌గా మారుతుంది.

సినిమాలోని హైలెట్స్ ఇవే అంటూ.. స్క్రీన్ పై ఆ సన్నివేశాలు వస్తున్నప్పుడు గుసుబంప్స్ కాయమంటూ కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. తండేల్‌ సినిమా ఇప్పటికే వచ్చేసిన స్పెషల్ ప్రీమియర్ టాక్ ప్రకారం.. మూవీ కచ్చితంగా హిట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఊహించిన దానికంటే ఎక్కువగా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయట. అందులోనూ.. సాయి పల్లవి, చైతు మధ్య నడిచే లవ్ ట్రాక్ మరింత హైలెట్ కానుందని.. చైతు కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ పెర్ఫార్మెన్స్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మూడు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎమోషన్స్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌లో పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ ప్రేక్షకులను మెప్పించింది. యాక్షన్ సీన్స్ కూడా ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

Thandel Movie (Feb 2025) - Trailer, Star Cast, Release Date | Paytm.com

విఎఫ్ఎక్స్‌.. బోట్ యాక్ష‌న్ ఎపిసోడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక సాధారణంగా ఓ సినిమా అంటే ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ సన్నివేశాల గురించి కచ్చితంగా చెప్పుకోవాలి.. తండేలు ఇంటర్వెల్లో లాస్ట్ 25 నిమిషాల సీన్స్.. అలాగే ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మైండ్ బ్లాక్ చేయడం ఖాయమని టాక్ నడుస్తుంది. తన కెరీర్‌లోనే బెస్ట్ హిట్‌తో రాజులమ్మ జాతర చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన అల్లు అరవింద్ 100కు వంద మార్కులు ఇచ్చేసాడు. ఈ క్రమంలోనే బన్నీ వాస్ దీనిపై పోస్ట్ షేర్ చేస్తూ థియేటర్లలో రాజులమ్మ జాతర అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ అంచ‌నాల‌ నడుమ ధియేటర్లలోకి రానున్న ఈ సినిమా టికెట్ రేట్ల పెంపులకు కూడా అనుమతి వచ్చేసిందట. మొదటి ఏడు రోజులు సింగిల్ స్క్రీన్ పై రూ.50.. మల్టీప్లెక్స్ రూ.75 పెంపుకు పర్మిషన్స్ లభించాయి. ఈ క్రమంలోనే ఏపీలో సింగిల్ స్క్రీన్ రూ.187 మల్టీప్లెక్స్ లో రూ.252 టికెట్ ధర ఉండగా.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ రూ.177 మల్టీప్లెక్స్ లో.. రూ. 295 టికెట్ ధరలు ఉండనున్నాయి.