టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌లో పవన్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని ఆటంకాలు ఎదుర్కొని షూటింగ్ కార్యక్రమంలో పూర్తిచేసుకుని వచ్చే నెల 28న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీనిపై తాజాగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని.. కేవలం కొన్ని ప్యాచ్ వర్క్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ వెల్లడించారు. ఇతర స్టార్స్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ప్రస్తుతం సారధి స్టూడియోస్‌లో రూపొందిస్తున్నారు. ఇక ఇదే సినిమాకు చివరి స్కెడ్యూల్. అయితే ప్రముఖ నటుడు అనుభవ్ ఖేర్ సెట్స్‌లో పాల్గొనాల్సి ఉండగా.. ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో.. ఆయన బదులుగా తమిళనటుడు సత్యరాజును తీసుకున్నట్లు సమాచారం.
పవన్ కూడా ఈ సెట్స్‌లో పాల్గొననున్నాడని.. వీరి మధ్యన కొన్ని కీలక సన్నివేశాలు షూట్ జరుగుతుందని తెలుస్తుంది. కేవలం నాలుగు రోజులు డేట్స్ ని పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇస్తే సరిపోతుందని సమాచారం. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో ట్రోల్స్, ఫన్నీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సినిమా దాదాపు సెట్స్‌పైకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా ఏడది ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ సంస్థతో డీలింగ్ కోసం.. అప్పటికప్పుడు టీజర్ రిలీజ్ చేయాల్సి వచ్చిందట. కాగా ఈ టీజర్ ప్రారంభంలో ఓ చిన్నారి ఏడుస్తూ కనిపిస్తుంది.. తన పేరే ఆరోహి పటేల్.
ఆమె అందరికీ గుర్తుండే ఉంటుంది.. సూరత్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మడు బాలీవుడ్లో పలు టీవీ సీరియల్స్, అలాగే కొన్ని సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లులో ఓ కీలక పాత్ర కోసం ఈ సినిమా ప్రారంభ దశలో సెలెక్ట్ చేసుకున్నారు. అప్పట్లో చిన్న అమ్మాయిగా ఉన్న ఈమె.. ఈ నాలుగేళ్లలో పూర్తిగా రూపం మొత్తం మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే అమ్మడి లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. తన ఇస్‌స్టాగ్రామ్ తెరిచి చూసిన ఎవరికైనా మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో అమ్మడు మెరుస్తుంది. నాన్ స్టాప్ రిల్స్ చేస్తూ నేటిజన్ దృష్టిని ఆకట్టుకుంటున్న ఆరోహి.. నేటితరం హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుకొని అందంతో కట్టిపడేస్తుంది. హాట్ నెస్ తో కుర్ర కారకు చెమటలు పట్టిస్తుంది.