SSMB 29: మహేష్ కు అన్నగా ఆ స్టార్ హీరో.. మ‌రోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కానా..

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రానున్న SSMB 29పై రోజుకో న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. సినిమాకు సంబంధించిన ప్ర‌తి వార్తలు ట్రెండ్ అవుతుంది. అలా తాజాగా SSMB 29లో మ‌రో తెలుగు స్టార్ హీరో న‌టిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇటీవల మహేష్, రాజమౌళి సినిమా ప్రారంభమైంది. రీసెంట్గా సినిమా ఓపెనింగ్స్ చాలా సింపుల్ గా.. ప్రైవేట్ గా నిర్వహించారు. ఈ సినిమా ఓపెనింగ్స్ ను సింపుల్గా ఏమాత్రం ఆర్భాటం లేకుండా కానించేశాడు జక్కన్న. ఇక ఆయ‌న ఆలోచనలు ఫ్యాన్స్ అంచనాలకు అందవ‌న సంగతి తెలిసిందే. ఇక సినిమాల మహేష్ ని ఎప్పుడు చూడని విధంగా చాలా డిఫరెంట్ గా జక్కన్న చూపించబోతున్నాడు.

ఇక‌ జక్కన్న సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో మార్పులు చేసుకున్నారు. కొన్నేళ్ళుగా పాటిస్తున్న సెంటిమెంట్లను కూడా ఆయన ఈ సినిమాపై నమ్మకంతో బ్రేక్ చేశాడు. ముఖ్యంగా ఎంత పెద్ద సినిమా అయినా ఓపెనింగ్స్ కు రాని మహేష్.. ఈ సినిమా కోసం ఓపెనింగ్స్ లో పాల్గొన్నాడని.. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రాజమౌళి మాటకు రెస్పెక్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు సినిమా కోసం మొట్టమొదటిసారి మహేష్ బాబు సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడట‌. ఫస్ట్ టైం సినిమా కోసం షర్ట్ విప్పబోతున్నాడని తెలుస్తుంది. ఇక దీంతో పాటే సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.

Venkatesh and Mahesh Babu : వెంకటేష్ కొడుకు అర్జున్, మహేష్ బాబు కొడుకు  గౌతమ్ ఇద్దరు కలిసి ఒకే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? |  entertainment ...

ఇక మహేష్ హీరోయిన్గా.. ప్రియాంక చోప్రా కనిపించనుందని.. విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించనున్నాడని టాక్. తాజాగా ఈ సినిమాలో మహేష్‌కు అన్నగా మరో స్టార్ హీరో వెంకటేష్ నటించ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే వీళ్ళ కాంబోలో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీరి కాంబో సెట్ అయిందని వార్తలో నిజమెంత తెలియదు కానీ.. టాక్ వైరల్ అవ్వడం అభిమానుల ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మళ్ళీ సినిమా వస్తే బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే సక్సెస్ కొడతారంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.