సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట‌ర్ రివ్యూ.. వెంకీ మామకు బ్లాక్‌బ‌స్ట‌ర్ పొంగ‌లేనా..?

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నేడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన‌ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఇక ఫులాఫ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బెనిఫిట్ షోస్ ఇప్పటికే యూఎస్ఏలో పూర్తి అయిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా ఎలా ఉందో.. ట్విట్టర్ రివ్యూల ద్వారా అభిమానులు షేర్ చేసుకున్నారు. ఆ మూవీ టాక్ ఎలా ఉందో ఒక‌సారి చూద్దాం.

ఇక ఇప్పటివరకు సినిమా చూసిన ఆడియన్స్ అందరూ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. ఆడియన్స్‌ను మూవీ ఆకట్టుకోవడం ఖాయమ‌ని చెప్తున్నారు. బుల్లి రాజు పాత్రలో వెంకటేష్ మెప్పించాడ‌ని.. ప్రత్యేకంగా మ్యూజిక్ సినిమా స‌క్స‌స్ చేయడానికి హైలెట్గా నిలిచిందని.. ఇక క్రాఫ్ట్ పరంగా చూసుకున్న సినిమా డీసెంట్‌గానే ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎప్పుడులానే.. తన కామెడీ ఫార్ములను ఉపయోగించార‌ని.. లాజిక్లు చూడకుండా కామెడీని ఎంటర్టైనర్‌గా పినిమాను చూడొచ్చని అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

మరో నెటిజన్ ఈ సినిమా కేవలం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. వెంకీ పాత్ర మెప్పించిందని.. సినిమాని ఎలివేట్ చేయడంలో సంగీతం కీలక పాత్ర పోషించిందని వివరించారు. గోదావరి గట్టు సాంగ్ ధియేటర్లో ఇంకా బాగుందంటూ వెల్లడించారు. ఐశ్వర్య, మీనాక్షిలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ మెప్పించిందని.. అనిల్ రావిపూడి తన టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ కావడంలో సక్సెస్ సాధించాడంటూ చెప్పుకొచ్చారు. స్టోరీ తో ఈ సినిమా డీసెంట్ గా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

మరో నెటిజన్ ఎంటర్టైన్ చేస్తూ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను మెప్పించడంలో సినిమా సక్సెస్ సాధించిందని.. ఇదో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని.. అనిల్ రావిపూడి తన సాధారణ జ‌నార్‌లో సినిమా తీసాడ‌ని.. ఎఫ్2కి సిమిలర్ గా మూవీ ఉందని.. కామెడీ బాగా వర్కౌట్ అయిందని.. అయితే ప్రొడక్షన్ వాల్యూ లో నాణ్యత లోపించిందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సినిమా ఆడియోస్ని ఎంటర్టైన్ చేసిన.. స్టోరీ లేన్ మాత్రం పెద్దగా కనిపించలేదని వెల్లడించాడు. ఇక స్టోరీ ఎలా ఉన్నా బుల్లి రాజు క్యారెక్టర్ల వెంకటేశ్ ఆకట్టుకున్నాడని.. మ్యూజిక్ బాగుందని.. ఫెస్టివల్ సీజన్లో చూసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమాగా ఉందంటూ వెల్లడించాడు.