టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా వెంకి మామ.. వరుస విజయాలతో రాణిస్తున్న అనిల్ రావిపూడి డైరెక్షన్లో, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమయ్యాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో.. శిరీష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా కనిపించారు. సెన్సేషనల్ కంపోజర్ బీమ్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 14న అంటే నేడు గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్ బిజినెస్ లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. ఇక వెంకీ మామ ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టాలంటే ఎన్ని కోట్లు కొల్లగొట్టాలో.. ఆ బిజినెస్ లెక్కలు ఒకసారి చూద్దాం.
ఈ సినిమాలో భారీ తరాగణం పనిచేశౄరు. ఇక సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ అంతా కలిపి సినిమాకు సుమారు రూ.90 కోట్ల వరకు ఖర్చయిందట. సినిమాలో పాటలు రిలీజ్ కి ముందు ట్రెండింగ్ కావడంతో సినిమాపై రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమాకు భారీగా బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.60 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. అందులో నైజం హక్కులను రూ.20 కోట్లకు లెక్క కట్టారు. సీడెడ్ హక్కులు రూ.10 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.8 కోట్లు, తూర్పుగోదావరి రూ.5 కోట్లు, పశ్చిమగోదావరి రూ.4.5 కోట్లు, గుంటూరు రూ.5 కోట్లు, కృష్ణ రూ.5 కోట్లు, నెల్లూరు రూ.3 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇక కర్ణాటక థియేటర్లు రేట్లు రూ.4 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మిగతా రాష్ట్రాల్లో రూ.1. 35 మిలియన్ డాలర్లు అంటే రూ.12 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. అలాగే ఓవర్సీస్ మిగతా దేశాల్లో కలిపి రూ.10 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. దీంతో సినిమా ఓవరాల్గా రూ.88 కోట్ల మేర బిజినెస్ లు జరుపుకుంది. దీన్నిబట్టి మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.90 కోట్ల షేర్.. రూ.150 కోట్ల గ్రాజ్ కొలగొట్టాల్సి ఉంది. ఇక వెంకీమామ పొంగల్ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే.. దాదాపు రూ.200 కోట్ల వరకు వసూళ్లు చేయాలి. ఈ క్రమంలోని తాజాగా రిలీజ్ అయిన సినిమా ప్రీమియర్స్ ప్రకారం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షో తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.