విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. గతేడాది సంక్రాంతి బరిలో సైంధవ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన వెంకటేష్ ఈ సినిమాతో నిరాశ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏడాది బ్రేక్ తర్వాత మళ్లీ సంక్రాంతి బారిలోనే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈసారి పొంగల్ మాత్రం బ్లాక్ బస్టర్ పొంగల్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు వెంకటేష్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌తో మరింత హైప్ పెంచుతున్నారు మేకర్స్. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా సినిమాల్లో కామెడీని అద్భుతంగా పండించాడని సమాచారం.
ట్రైలర్ హిట్ అవడం.. పాటలు ట్రెండ్ క్రియేట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైన వెంకీ మామ.. ఇప్పటికే బుక్ మై షో లో సంచలనం సృష్టించాడు. 100 కే ప్లస్ టికెట్స్ సోల్డ్ అయ్యాయని మేకర్స్ అఫీషియల్ గా దీనిని వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనున్నారు. బీమ్ సిసీలియో మ్యూజిక్ అందించిన ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని యూ/ఎ సర్టిఫికెట్స్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో సినిమా చూసిన సెన్సార్ సభ్యుల రివ్యూ వైరల్ గా మారుతుంది. చాలాకాలం తర్వాత పూర్తిస్థాయిలో ఓ కామెడీ ఎంటర్టైనర్‌ను చూసామని.. కడుపుబ్బ నవ్వు కొన్నామని వారు చెప్పినట్లు తెలుస్తుంది. వెంకటేష్ కామెడీ బాగా ఆకట్టుకుంటుందని.. ఇక వెంకీ కామెడీ టైమింగ్ తో పాటు.. మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ ల మధ్య వచ్చే సీన్స్ కూడా హెలోరియస్‌గా ఉన్నాయంటూ సెన్సార్ సభ్యులు వివరించారట. మొదటి నుంచి చివరి వరకు సినిమాల్లో కామెడీకి కొదవ ఉండదని.. అంతేకాదు థ్రిల్లింగ్ పెంచే సన్నివేశాలు కూడా ఉన్నాయి.. ప్రేక్షకులంతా ఫ్యామిలీస్ తో వెళ్లి సినిమాను చూసి ఎంజాయ్ చేసేలా ఉందంటూ సెన్సార్ సభ్యులు వెల్లడించినట్లు సమాచారం. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు కంటే భిన్నంగా ప్రమోట్ చేస్తూ వచ్చాడు. టీవీ షోస్, రీల్స్, ఇంటర్వ్యూస్ ఇలా అన్నింటిని కవర్ చేస్తే సినిమాపై మరింత హైప్‌ని పెంచాడు. ఈ సినిమా రిలీజ్ ముందే ప్రేక్షకులకు హైప్ క్రియేట్ అయింది. విడుదలైన తర్వాత సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం లాంగ్ రన్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.