డాకుమారాజ్ మూవీ సిల్లీ రీజన్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ అన్ లక్కీ హీరో.. ఎవరో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో నిలిచి ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య సినిమా చూడడానికి ఆసక్తి చెబుతున్నారు జనం. దీంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు పెద్ద దెబ్బ పడినట్లు అయింది. చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నెగటివ్ టాక్ రావడం.. దానికి తగ్గట్టుగానే బాలయ్య సినిమా హిట్ టాక్ రావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అయితే డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య ఎక్కువ వైలెన్స్తో క‌నిపించాడు. యాక్షన్, ఆయనకిచ్చిన ఎలివేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని సినిమాకు మరింత హైప్‌ పెంచాయి. సినిమా హిట్ టాక్‌ తెచ్చుకోవడానికి కార‌ణం అయ్యాయి.

ఈ క్రమంలోనే సినిమా హిట్ టాక్ రావడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కంటే ముందే డైరెక్టర్ బాబీ మరో హీరోని అనుకున్నాడట. కానీ క‌థ విన్న‌ ఆ హీరో మాత్రం సిల్లీ రీజ‌న్‌తో సినిమాను రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. బాబీ కథను వినిపించిన తర్వాత స్టోరీ బాగుంది కానీ.. వైలెన్స్ ఎక్కువగా ఉందని సినిమాలో రిజెక్ట్ చేశాడట. ఆ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు.. వైలెన్స్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఇలాంటి వైలెన్స్ ఉన్న సినిమాల్లో నేను నటిస్తే అభిమానులు యాక్సెప్ట్ చేయరు. ఇందులో కొన్ని సీన్స్ మరింత వైలెన్స్ గా అనిపిస్తున్నాయి.

ఆ సన్నివేశాలు తొలగిస్తే సినిమాలో చేస్తా.. లేదంటే నో అని చెప్పేశాడ‌ట‌. ఇక ఈ సినిమాలో వైలెన్స్ సీన్స్‌ హైలెట్. దీంతో వాటిని తొలగించడం ఇష్టం లేని బాబి.. కథకు బాలయ్య బాగా సెట్ అవుతారనే ఉద్దేశంతో ఆయనను అప్రోచ్ అయ్యారట. కథ విన్న బాలయ్య స్టోరీ బాగా నచ్చడంతో.. సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఆడియన్స్ దీనిపై రక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. బాల‌య్య తప్ప.. డాకు మహారాజ్ పాత్రలో మరెవరు నటించిన అసలు సెట్ కాదని.. ఆయన ఏజ్ లో ఉన్న ఏ హీరో కూడా ఇలాంటి ఛాలెంజింగ్‌ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోలేర‌ని.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.