మన్మధుడు బ్యూటీ అన్షూ తాజాగా రీఎంట్రీ కి సిద్ధమైంది. సందీప్ కిషన్, రీతు వర్మ కాంబోలో తెరకెక్కుతున్న మజాకా మూవీలో అన్షూ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఇటీవల గ్రాండ్గా జరిగింది. కాగా ఈవెంట్లో ఈ మూవీ డైరెక్టర్ త్రినాధ్‌రావు మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్‌కు సైజ్‌లు ఎక్కువ కావాలంటూ చేసిన వల్గర్ కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సీనియర్ హీరోయిన్ పై ఎలాంటి దారుణమైన కామెంట్లు చేయడం పట్ల సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈవెంట్లో త్రినాధరావు మాట్లాడుతూ.. హీరోయిన్ రీతు వర్మ పేరు మర్చిపోయినట్లుగా నటించి వాటర్ అడుగుతూ ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ పై సెటర్లు పేల్చాడు.
త్రినాథ్ కామెంట్స్ ప్రస్తుతం వివాదంగా మారాయి. అంతేకాదు.. మరో అడుగు వేసి మరి హీరోయిన్ అన్షుని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆమె సన్నగా ఉందని.. తెలుగు ఆడియన్స్‌కు సైజులు కావాలి.. తెలుగు వాళ్ళకి సైజులు కావాలని తిని లావు అవ్వమ్మ అంటూ వల్గర్ కామెంట్స్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ట్రోల్స్ చేస్తూ ఆయనను విపరీతంగా ఆడుకుంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో నాన్న రచ్చగా మారింది. ఈ క్రమంలోనే దీనిపై మహిళా కమిషన్ రియాక్ట్ అయ్యారు. చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నరెళ్ళ శారద దీనిపై రియాక్ట్ అవుతూ.. త్రినాధ్ రావు నక్కిన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరిస్తున్నామని.. త్వరలో ఆయనకు నోటీసులు అందిస్తామని.. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించబోతున్నట్లు వివరించారు. ఇది ఇప్పుడు మరింత చర్చ నీయాంశంగా మారింది. మొత్తానికి డైరెక్టర్ నోటి దూల సినిమాను వివాదంలో పడేసినట్లయితే.. డైరెక్టర్‌పై అంతా మండిపడుతున్న క్రమంలో.. ఆయన రియాక్ట్ అవుతూ దీనిపై వివరణ ఇచ్చాడు. అందరికీ నమస్కారం.. ముఖ్యంగా మహిళలకు, అన్షు గారికి మరియు నా మాటల వల్ల బాధపడ్డా ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్న. నా ఉద్దేశం ఎవరిని బాధ పెట్టాలని కాదు. తెలిసి చేసిన తెలియకుండా చేసిన తప్పు తప్పే. మీరందరూ పెద్ద మనసు చేసుకొని క్షమించాలని కోరుకుంటున్నా అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు.