విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో అంటేనే మూవీ పక్క హిట్ అనే అంచనాలు చాలామందిలో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్ జరుపుతూ ఆడియన్స్‌లో హైప్‌ను పెంచారు. అలా సినిమాకి సంబంధించిన రిల్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్, విజువల్స్ ప్రతిదీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సంక్రాంతి సరైన విన్నర్ వెంకీ మామ అనేలా ఇప్పటికే జోరు కొనసాగుతుంది.
ఎప్పుడెప్పుడు వెంకటేష్ సినిమా వస్తుందా.. ఎప్పుడు చూద్దామా అంటూ ఆడియన్స్ అంత కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంక్రాంతి వస్తున్నాం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్ జోరుగా జరుగుతుండడం విశేషం. ప్రస్తుతం బుక్‌మైషోలో ఈ సినిమా తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 100 కే ప్లస్ టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం. అంటే సినిమాకు లక్ష టికెట్లు బుక్ మై షో లో ఆడియన్స్ కొనుగోలు చేసేసారు. ఇంకా ఆ లెక్క కొనసాగుతూనే ఉందని మేకర్స్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేస్తూ షేర్ చేసుకున్నారు.
అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు హైదరాబాద్‌లో అడ్వాన్స్ సేల్స్ ద్వారా రూ.16 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని సమాచారం. యూఎస్ఏతో సహా ఇతర ప్రాంతాల్లో ఇదే రేంజ్‌లో హవా కొనసాగుతుంది. కేవలం నైజంలోనే ఇంత హంగామా అంటే.. ఆంధ్ర సీడెడ్‌లో ఏ రేంజ్ లో కలెక్షన్లు ఉంటాయో ఊహించుకోవచ్చు. వెంకీ కెరీర్‌లో ఇప్పటివరకు ఫస్ట్ డే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చేసిన మూవీ అంటే ఎఫ్ 3. ఫస్ట్ డే సుమారు రూ.14 కోట్లను సొంతం చేసుకుంది. ఇప్పుడున్న క్రేజ్ రిత్య సంక్రాంతి వస్తున్నాం సినిమా ఆ కలెక్షన్‌లు దాటేయడం చాలా ఈజీ అంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వెంకీ మామకి సంక్రాంతికి వస్తున్న మూవీ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఉండనుంది. ఈ లెక్కన ఫస్ట్ రూ.20 కోట్ల మార్క్ సినిమా సులభంగా దాటుతుంది అంటూ సమాచారం.