సత్తా చాటుకున్న డాకు మహారాజ్.. బాలయ్య ఖాతాలో మరో రేర్ రికార్డ్..!

నందమూరి బాలయ్య నటించిన తాజా మూవీ డాకు మహరాజ్. యాక్ష‌న్ ఎంటర్టైలర్‌గా బాబి కొల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. జనవరి 12న బాక్సాఫీస్ బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ధియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇక సినిమాపై పాజిటివ్ బజ్‌ రావడంతో.. కేవలం బాలయ్య అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డాకు మహారాజ్ రేర్ రికార్డును సొంతం చేసుకుంది.

Daku Maharaju : డాకు మహారాజు సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్  చేస్తున్నారా..?ఇందులో విశేషాలు ఏంటంటే..? | entertainment news in telugu |  ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇన్ ...

మొదటి రోజే యూఎస్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసి పడేసిన డాకు.. అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. దీన్నిపై మూవీ టీం అఫీషియల్ గా ప్రకటిస్తూ.. మూవీ పోస్టర్‌ను షేర్ చేసుకున్నారు. డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అభిమానుల్లో అంతకంతకు అంచనాలు పెరుగుతూ వచ్చాయి. సినిమాలో ప్రతి డైలాగ్ ప్రేక్షకులను మెప్పించింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవరనాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

NRIPage | Box Office | Movie News | 'NBK 109' New Film Title Revealed:  Daaku Maharaj

ఇక సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా మెరుసారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ స్టైలిష్ విల‌న్‌గా.. చాందిని చౌదరి కీలక పాత్రలు కనిపించారు. ఇక సినిమాలో థ‌మన్ బిజిఎంపై ఆడియన్స్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే డాకు మహ‌రాజ్‌ సినిమాకు అమెరికాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్స్ లో రికార్డులు నెలకొల్పిన ఈ సినిమాకు.. ఇప్పటికే పదివేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలో దాదాపు 125 లొకేషన్ లలో 350 షోలులో ఫస్ట్ రోజు నుంచే ప్రదర్శించారు.