టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య.. మనస్తత్వం గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చాలా కోపిష్టి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు ఆయనతో పనిచేసిన కోస్టార్స్‌కు మాత్రమే బాలయ్య మంచి వ్యక్తిత్వం గురించి తెలుస్తుంది. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అన్ని.. ఎవర్నైనా నమ్మితే ఎలాంటి పని చేయడానికి అయినా వెనకాడరంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే బాలయ్య చిన్నపిల్లడి మనస్తత్వానికి కనెక్ట్ అయిన సెట్స్ లోని పిల్లలు కూడా ఆయన నుంచి విడిపోవాలంటే ఎంతో బాధపడిపోతూ ఉంటారు. కంటతడి పెడుతుంటారు. ఇప్పుడు డాకు మహారాజ్ షూటింగ్ లాస్ట్ రోజు కూడా ఇదే సంఘటన జరిగింది.
ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ వేద.. బాలయ్యను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ వేద అగర్వాల్ ఎవరు.. అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక డాకు మహారాజ్ మూవీలో మొదటి గంట వరకు సినిమాల్లో కథను మలుపు తిప్పే రోజుల్లో సెంటిమెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది.. తన నటనతో ప్రశంసలు అందుకుంది. అయితే ఈ అమ్మడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. వేద అగర్వాల్ తండ్రి మాధవ్ ఓ సింగరట. మ్యూజిక్ కంపోజర్. కాగా తల్లి మేఘ హౌస్ వైఫ్ అని తెలుస్తుంది. మాధవ్.. గజాల్, భజన్, తుమ్రిలో ఎక్స్పెర్ట్. ఈ క్రమంలోనే ఐఐఎంఏ అవార్డుల్లో బెస్ట్ మెయిల్ సింగర్ గా నామినేట్ అయ్యారు మాధవ్.
ఇక వేద అగర్వాల్ బాలయ్యకు ఎంతలా యటాచ్ అయిందో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఈ పాప కన్నీరు పెట్టుకుంటున్న వీడియో అందరిని ఎమోషనల్ చేసింది. దీన్ని బట్టి బాలకృష్ణ తో ఆ పాపకు ఎంత బాండింగ్ ఏర్పడిందో తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో బాలకృష్ణను వదిలి వెళ్ళలేక ఆయన హత్తుకొని ఏడుస్తుంది వేద. ఈ క్రమంలో బాలయ్య ఆ పాపకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఏదో ప్రామిస్ చేసినట్లు అర్థమవుతుంది. అయితే ఆయన ఏం చెప్పారు అనేది మాత్రం తెలియదు కానీ.. చివరకు పాపని తన మాటలతో నవ్వించాడు బాలయ్య. చివరిగా పాపకు ముద్దు పెట్టి ఆమెను సంతోషంగా వాళ్ళ పేరెంట్స్ తో పంపించిన వీడియో నెటింట వైరల్‌గా మారడంతో.. బాలయ్య మనస్తత్వం, మంచితనం అలాంటిది. ఎదుట ఉన్నదీ ఎలాంటి వారైనా ఆయన మనసుకి ఫిదా అవ్వాల్సిందే అంటూ.. బాలయ్య నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.