నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌తో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో నటించిన తాజా మూవీ డాకు మహారాజ్. ఆదివారం గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్‌లో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి. అయితే గతంలో బాలయ్య సినిమాలు కేవలం ట్రోలింగ్ స్టఫ్‌గానే ఉండేది. ఆడపా దడపా సినిమాలతో హిట్ కొట్టిన బాలయ్య చాలా వరకు ఫ్లాప్ లను ఎదుర్కొంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే అఖండ తర్వాత తన కెరీర్ యూ టర్న్ తీసుకుంది.
అఖండ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డాకు మహారాజ్ తాజాగా రిలీజై సూపర్ డూపర్ హిట్ తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ సినిమాతో బాలయ్య సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే బాలయ్య అఖండ నుంచి డాకు మహారాజ్ అన్ని సినిమాల్లో టచ్ చేసిన ఓ పాయింట్ నెటింట వైరల్ గా మారుతుంది. బాలయ్య తాజాగా రిలీజ్ అయిన డాకు మహారాజ్‌లో సెంటిమెంట్ ఫెలోగా.. మరో పక్కన యాక్షన్ తోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటించిన బాలయ్య ఓ పక్కన డాకు మహారాజ్ రోల్‌కు మరెవరు సెట్‌కారు అనేంతలా ఆకట్టుకున్నాడు. అలాగే నానాజీ రోల్ లో సాధారణమైన డైలాగ్స్ చెప్తూనే ప్రేక్షకులను ఎమోషన్స్ తో మెప్పించాడు.
అయితే బాలయ్య ఆఖండ సినిమాలోని సెంటిమెంట్ ఎక్కువగా పండించాడు. అంతేకాదు.. మరో పక్కన యాక్షన్ తోను ఆకట్టుకున్నాడు. వీరసింహారెడ్డిలోను సెంటిమెంట్ ఉంది. భగవంత్ కేసరి సినిమాలోను ఇదే పాయింట్ హైలెట్ చేశారు. ఒకప్పుడు కేవలం మాస్ కంటెంట్ మాత్రమే బాలయ్య సినిమాల్లో తొడ కొట్టడం, నరకడం, ఫైట్లు చేయడం లాంటివి మాత్రమే కనిపించేవి. కానీ.. అక్కడ నుంచి బాలయ్య నటించిన ప్రతి సినిమాలోను సెంటిమెంట్ కూడా ఫాలో అవుతున్నారు. ఓ పక్కన యాక్సిడెంట్ తో పాటు.. సెంటిమెంట్లు బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అంతకుముందు వరకు కేవలం బాలయ్య అంటే మస్ అనుకున్న వారందరికీ అఖండ సినిమాతో బాలయ్యను ఎమోషనల్ బాలయ్యగా.. ఆడియన్స్‌కు పరిచయం చేశాడు బోయపాటి. ఈ సినిమా తర్వాత నుంచి బాలయ్య నటించిన ప్రతి సినిమాలోను సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకుంటున్నాయి. అలా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా భారీ లెవెల్లో వచ్చాయంటూ సమాచారం.