ప్రస్తుతం బాలయ్య వరుస హ్యాట్రిక్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు బాలయ్య సినిమాలంటే ఒక్క సక్సెస్ వస్తే.. రెండు ఫ్లాప్‌లు ఇస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత.. బాలయ్య నటించిన సినిమాలన్నీ అంతంత మాత్రం గానే ఉండడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకులోనయ్యారు. బాలయ్యకు బోయపాటి శ్రీను.. సింహా, లెజెండ్ సినిమాలతో హిట్లు వచ్చినా.. మ్యూజిక్ విషయంలో మాత్రం ఒకింత అసంతృప్తి నెలకొనేది. కానీ.. గత కొన్నేళ్ళలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం బాలయ్య లక్కీ టైం నడుస్తుంది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు.
అయితే ఈ క్రమంలోనే తాజాగా డాకు మహరాజ్ సినిమాతో సరికొత్త హ్యాట్రిక్‌కు బాలయ్య నాంది పలికాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఖాతాలో రూ.100 కోట్ల షేర్ వసూళ్ళు రావడం పక్కా అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. గత సినిమాలు హిట్ అయినా ఈ రికార్డును మాత్రం అందుకోలేకపోయాయి. అయితే డాకు మహారాజ్‌తో బాలయ్య రూ.100 కోట్ల షేర్ కలెక్షన్లు సునాయాసంగా దక్కించుకుంటాడు అంటూ అభిమానులు చెప్తున్నారు. సాంగ్స్ విషయంలో నిరాశపరిచినా.. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని.. బాలయ్య నటనకు.. థమన్ మ్యూజిక్ కోసమైనా సినిమాలు చూడొచ్చని.. సినిమా విజువల్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యల ధియేటర్లలో ఈ సినిమా బెనిఫిట్స్ రిలీజ్ అయ్యాయి. గేమ్ ఛేంజర్‌కు మిక్స్డ్ టాక్ రావడంతో.. బాలయ్య డాకుమారాజుకు ఒకింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లేకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య మ్యాజిక్ చేస్తున్నాడు. అలా డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ వద్ద.. సంక్రాంతి బరిలో మహారాజు అనిపించుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే బాలయ్య తన సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అందులో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో వేచి చూడాలి.