నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టి డబల్ హ్యట్రిక్‌కు ఖాతా ఓపెన్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ తో హిట్ టాక్ సంపాదించిన బాలయ్య.. ఆదివారం రిలీజ్ అయిన ఈ సినిమాతో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నారు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా సినిమా ఉందని.. అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్న రికార్డులు బ్రేక్ చేసే సినిమా అవుతుందని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా డాకు మహారాజ్ మూవీ టీమ్ అంతా కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారీ రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ కాబోతుందని వివరించారు. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ టీం తాజాగా ఆదివారం రాత్రి గ్రాండ్‌గా సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.
ఇందులో టీం తో బాలయ్య సన్నిహితులు, యంగ్ హీరోలు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక యంగ్ హీరోలల్లో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ ఈవెంట్లో పాల్గొని చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే గట్టిగా పార్టీ చేసుకుంటూ బాలయ్యతో కలిసి సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు విశ్వక్ , సిద్దు. అయితే ఇందులో ఈ ముగ్గురు హీరోలు కలిసి ముద్దలతో రచ్చ చేశారు. డాకు మహరాజ్ సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ టు డాకు మహారాజ్ అని విశ్వక్ అనగా.. థాంక్యూ లైలా అంటూ బాలయ్య విశ్వక్‌కు ముద్దు పెట్టాడు. నా సక్సెస్ మీ సక్సెస్. ఇది ఫిలిం ఇండస్ట్రీ సక్సెస్ అంటూ వెల్లడించాడు. వెంటనే విశ్వక్.. బాలయ్యకు కిస్ చేసాడు. ఇంతలో సిద్దు జొన్నలగడ్డ నాకు కిస్ పెట్టలేదు అని అడగగా.. సిద్దుకి ముద్దు పెట్టాడు బాలయ్య. అనంతరం బాలయ్య కి ముద్దు పెట్టాడు సిద్దు.
ఇలా ముగ్గురు కిస్సులతో రచ్చ రచ్చ చేశారు. హీరోయిన్స్‌ని పక్కనపెట్టి హీరోలే ముద్దులు పెట్టుకుంటూ దాన్ని సెల్ఫీ వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం హైలైట్ గా మారింది. మరోవైపు డైరెక్టర్ బాబికి కూడా బాలయ్య కిస్ చేశాడు. ప్రస్తుతం ఇది నెటింట వైరల్‌గా మారుతుంది. పార్టీ మూడ్‌లో రెచ్చిపోవడం ఆడియన్స్‌లో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ వీడియోలో సెలెబ్స్ అంతా పార్టీ మూడ్‌లో ఆనందంగా సందడి చేశారు. ఇక ఇప్పటికి డాకు మహరాజ్ చూసిన ఆడియన్స్ బాలయ్య డ్యూయల్ రోల్‌లో అదరగొట్టాడని.. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ పాత్ర నడివి చిన్నదైనా కీలకపాత్ర పోషించారని.. థమన్ మ్యూజిక్ హైలెట్ అంటూ బాబి డీఎల్ స్టైలిష్ పవర్ఫుల్ రోల్‌లో మెప్పిస్తాడంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి కింగ్‌గా డాకు మహారాజు నిలుస్తుంది అంటూ బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.