తల లేని మనిషి స్టోరీతో డాకు మహారాజ్ ప్రిక్వెల్ అనౌన్స్మెంట్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. యంగ్‌ డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీ గా తెర‌కెక్కిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ఆదివారం రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. రిలీజ్ కు ముందు ఊహించిన రేంజ్‌లో సినిమా పై బాజ్‌లేకున్నా.. రిలీజ్ తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డాకు మహారాజ్ పేరు మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే నిర్మాత నాగ వంశీ నందమూరి ఫ్యాన్స్‌కు ఓ సర్ప్రైజింగ్ న్యూస్ వెల్లడించాడు.

Producer Naga Vamsi & Bobby Q&A With Media @ Daaku Maharaaj Success Press Meet | Balakrishna

సినిమా నుంచి మంచి టాక్ రావడంతో మూవీ టీం ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ.. డాకు మహారాజ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అనే ప్రశ్న ఎదురు కాగా.. దానిపై రియాక్ట్ అవుతూ సీక్వెల్ కాదు ఫ్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం.. సినిమాలో గుర్రంపై చూపించిన ఓ సీన్‌ను బేస్ చేసుకుని దాని తెర‌కెక్కించేందుకు ప్రయత్నిస్తాం అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఖాతాలో మరో హిట్ పడుతుందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. గుర్రంపై కూర్చున్న తల లేని వ్యక్తి కథను సినిమాగా చేసి డాకుమార సిక్వెల్ ప్లాన్ చేస్తున్నాం అంటూ చెప్పడం ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొల్పుతుంది. సీక్వెన్స్ ఆలోచనలు తాను వంశి తో షేర్ చేసుకున్నానని.. ఆయన చాలా ఆనందని వ్యక్తం చేశారని బాబి కొల్లి వివరించాడు. సినిమా సక్సెస్ మీట్‌ అనంతపురంలోనే గ్రాండ్‌గా నిర్వహించనునామ‌ని.. తేదీని ప్రకటిస్తామని వంశీ వెల్లడించారు.