బాలయ్య ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లు అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నుంచి తాజాగా వచ్చిన మూవీ డాకు మహారాజ్. మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో జనవరి 12న రిలీజ్ అయింది. ఇక సంక్రాంతి బాల‌య్య‌ ఎంత సెంటిమెంట్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య బొమ్మ బ్లాక్ బాస్టర్ పక్కా. అదే సెంటిమెంట్ ఇప్పుడు వర్క్ అవుతుంది. బాలయ్య‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషితో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకు హిట్ టాక్ రావడం భారీ అంచనాలతో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్‌లో రావడం తో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చాయో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

బాలయ్య చేస్తున్న డాకు మహారాజ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్న బాబీ...

సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాయి సౌజన్యలు నిర్మించిన ఈ సినిమా రూ.100 కోట్ల‌ భారీ బడ్జెట్‌తోనే తెర‌కెక్కించారు. ఇందులో బాలయ్య హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా చాందిని చౌదరి, హర్షవర్ధన్, హిమజ, బాబి డియోల్‌, ఊర్వ‌శి రౌతెలా తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఇక సినిమాకు థ‌మన్‌ బాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్గా నిలిచింది. అఖండ నుంచి బాలయ్య వరుస హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో సినిమా అంచనాలను అందుకుందా లేదా.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. భారీ లెవెల్‌లో జరుపుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.67.30 కోట్ల బిజినెస్ జరిపింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్ల టార్గెట్‌తో సినిమా రిలీజ్ అయింది.

Bobby Deol's Movie 'Daku Maharaj: 'बॉबी देओल की नई फिल्म 'डाकू

కాగా.. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర బాల‌య్య ఊచ‌కోత మొద‌లైంది. ఏకంగా ఫ‌స్ట్ డేనే రూ.30 కోట్ల క‌లెక్ష‌న్‌లు బాలయ్య సొంతం చేసుకున్నట్లు సమాచారం. అడ్వాన్స్ బుకింగ్, ఓవర్సీస్ ప్రీమియర్, స్పెషల్ షోస్‌తోనే బుకింగ్స్‌తోనే కలెక్షన్స్ ఈ రేంజ్‌లో ఉన్నాయని టాక్ నడుస్తుంది. మరి ఒరిజినల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడాలంటే టీం అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీపై డైరెక్టర్ బాబి తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. హిట్‌ కొట్టాడా.. లేదా.. అన్నది ఫస్ట్ డే కలెక్షన్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్తోనే తెలియనుంది. ఇకపోతే బాలయ్య‌ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో మరోసారి అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం తీసుకురానున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందట.