డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన తాజా మూవీ డాకు మహరాజ్. సంక్రాంతి బరిలో ఎప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు లాగే డాకు మహారాజ్‌కి కూడా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకు తెల్లవారుజామునుంచే బెనిఫిట్స్ పడడంతో.. 8 గంటల లోపే రివ్యూస్ బయటికి వచ్చాయి. బాలయ్య నట విశ్వరూపం, ఆయన యాక్షన్, డైలాగ్స్, విజువల్స్, ఎలివేషన్స్ అన్ని ప్రేక్షకులను మెప్పించాయి. ఆడియన్స్ బాలయ్య నటనకు ఫిదా అయ్యారు. అయితే సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ అంటూ ఎంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా డాకు మహారాజ్ సక్సెస్ టాక్‌తో ప్రేక్షకులను బాలయ్య స్వయంగా పలకరించాడు. సినిమా ఎలా ఉందంటూ అభిమానులకు ఫోన్ కాల్ చేసి మరి అడిగి తెలుసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. బాలయ్య మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ అభిమానులు నెటింట షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉందంటూ బాలయ్య అడగగానే.. ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అంటూ వివరించాడు.
కంగ్రాచ్యులేషన్స్ అన్నగారు.. సూపర్ ఉంది, మీ యాక్టింగ్ మాత్రం నట విశ్వరూపం అంతే.. అసలు ఫస్ట్ హాఫ్ పీక్స్ అన్నగారు.. సెకండ్ హాఫ్ సెటిల్ యాక్టింగ్ చాలా బాగుంది. మీది వన్ మ్యాన్ షో అన్నగారు అంటూ అభిమాని చెప్పుకొచ్చాడు. ఇక థమన్ గారి మ్యూజిక్ అదిరిపోయిందని, బాబి గారి టేకింగ్.. విజువల్స్ అన్ని అదుర్స్. మీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్ చెప్పడంతో బాలయ్య చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. అయితే అతనితో పాటు బాలయ్య ఇంకా ఎంతో మంది అభిమానులతోనూ ముచ్చటించారు. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ను ఫ్యాన్స్ నెటింట వైరల్ చేస్తూ.. సంక్రాంతి హీరోగా బాలయ్య టాప్ లో నిలుస్తాడంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Received call from GOD OF MASSES 🥰 Congratulated for #BlockbusterDaakuMaharaaj 🔥 and conveyed Sankranthi wishes 😍 #JaiBalayya #NandamuriBalakrishna #DaakuMaharaaj pic.twitter.com/lcYzKCzvBY
— Sailendra Medarametla ᴹᵃʰᵃʳᵃᵃʲ (@sailendramedar2) January 12, 2025