ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో డాకు మహారాజు ఒకటి. బాబి కొల్లి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య నటించిన ఈ మూవీ తెల్లవారుజామున బెనిఫిట్ షోస్ పడడంతో ఉదయం నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేశారు. బాలయ్య యాక్టింగ్.. అందుకు తగినట్లు డైరెక్టర్ బాబి ఎలివేషన్.. మేకింగ్.. అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక థమన్ మ్యూజిక్‌ఖు స్పీకర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే.. ద బెస్ట్ ఇచ్చాడంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి తనయుడు ఎస్. ఎస్. కార్తికేయ.. డాకు మహారాజ్‌పై చేసిన ఇంట్రెస్టింగ్ ట్విట్ వైరల్‌గా మారుతుంది. డాకు మహరాజ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని వింటున్నా.. త్వరగా చూడాలని అనుకుంటున్నా.. ప్రోమో టీజర్, ట్రైలర్‌లోనే బాలయ్య ప్రజెన్స్ అదరగొట్టేశారు. బాలయ్యని బాబి.. కొత్త అవతారంలో చూపించినట్లు తెలుస్తోంది. బాలయ్యతో థమన్ కాంబో అంటేనే అదిరిపోతుంది. వంశీ కంటిన్యూగా హిట్లు కొడుతూనే ఉన్నాడు అంటూ కార్తికేయ తన ట్విట్ లో పేర్కొన్నాడు.
ప్రస్తుతం కార్తికేయ చేసిన వైరల్ గా మారుతున్నాయి. ఇక డైరెక్టర్ బాబి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించగా.. ఊర్వశి రౌతెల స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా పాజిటివ్ టాక్ రావడంతో.. బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాలి.