ఆ కసితోనే బాలయ్య తో డాకు మహారాజ్ చేశా..!

టాలీవుడ్ యంగ్‌ డైరెక్టర్లు ఒకరైన బాబి కొల్లి మాస్‌ సినిమాలకు కేరఫ్ అడ్ర‌స్‌గా మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాబీ నుంచి డాకు మహ‌రాజ్‌ సినిమా రిలీజ్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్ రూపొందించిన‌ ఈ సినిమా నేడు ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా బాబి శనివారం హైదరాబాద్లో విలేఖ‌ర్ల‌తో మాట్లాడారు. గుంటూరులో మాస్ సినిమాలు చూస్తూ తిరిగే వాడిని.. థియేటర్లో కూర్చున్నంతసేపు ఈల‌లు వినపడాలి, హీరో ఎప్పుడు వస్తాడు అని అంతా ఎదురు చూడాలి.. పాట ఆకట్టుకోవాలి, ఇంటర్వెల్ బ్రేక్లో ఇంకేదో జరగబోతుంది అన్న ఆసక్తి కనబడాలి.. ఒక ప్రేక్షకుడిగా నా ఆలోచన ఇలానే ఉంటాయి. ప్రేక్షకుడిగా ఇతరహ‌ సినిమాలే నాకు నచ్చుతాయి.

ఇప్పుడు దర్శకుడుగా మారిన అలాంటి ఆలోచనలు చేస్తున్న. ఓ సీనియర్ హీరోకి తగ్గ కథ‌ని ముందే రాసుకున్నా. ఆ కథను బాలయ్యతో తీయాలనుకున్నప్పుడు ఆయనకు నాకు మధ్య చాలా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన కొన్ని ఆలోచనతోనే అప్పటికే ఉన్న కథ సెకండ్ హాఫ్ లో బాలయ్య ఇచ్చిన ఓ కీలక అంశాన్ని జోడించాం. సినిమాలో మరింత ప్రత్యేకత ఏర్పడింది. సీతారాం కాస్త డాకు మహారాజ్ ఎలా అయ్యాడని ఇందులో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎంతో నిజాయితీగా కథను ఆడియన్స్‌కు చూపించే ప్రయత్నం చేసాం. ఇక డాకు అప్పటికే కథ బాగా రాస్తాడు. సినిమాలో కథ‌ని పరుగులు పెట్టించే స్క్రీన్ ప్లే ఉంటుందని టాక్ నాకు వచ్చింది. వీటన్నిటికీ తోడు విజువల్స్‌తో గొప్ప సినిమా చేయాలనే ఓ కసీ, తపనతోనే ఈ డాకు మ‌మ‌రాజ్‌ సినిమాను తీశా.

కొరియన్ సినిమాలు చూసినప్పుడు, నైట్ ఫ్లిక్స్‌లో ఇతరత్రా సినిమాలు చూసినప్పుడు మనం కూడా ఇదే కెమెరా కదా వాడేది.. ఇంత క్లియర్ గా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనుకునేవాడిని. జైల‌ర్ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌ విజయ్ కాణ్ణ‌న్‌తో కలిసి సినిమాకి ముందు ఈ విషయం గురించి ప్రత్యేకించి మాట్లాడాక షూట్‌ ను మొదలుపెట్టమంటూ వివరించాడు. అంతేకాదు సినిమాకు సంబంధించి, బాలయ్య, అలాగే హీరోయిన్లకు సంబంధించి బాబి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక ఇదివరకు చిరుతో, ఇప్పుడు బాలయ్యతో, అంతకుముందు వెంకటేష్‌తో సినిమాలు చేశాం. సీనియర్ హీరోలతో అనుభవం దర్శకులకు చాలా ఉపయోగపడుతుంది. చెప్పిన స్క్రిప్ట్ తెరపై వెళ్లేసరికి ఎలా కథ ఉంటుందని వాళ్లకు అవగాహన ఉంటుంది. సెట్ లోకి రాగానే పని రాక్షసులుగా మారిపోతారు అంటూ చెప్పుకోవచ్చాడు. ప్రస్తుతం బాబి చేసిన కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి.