స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ సమంతకు సంబంధించిన ఏదో న్యూస్ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే నాగచైతన్యత విడాకుల తర్వాత సమంత అడపా దడపా తెలుగు సినిమాల్లో నటించినా.. తర్వాత బాలీవుడ్ చెక్కేసి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్‌తో ప్రేమలో పడిందని.. వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ కారణంగానే సమంత తెలుగు సినిమాల్లో కనిపించడానికి ఇష్టపడటం లేదంటూ కూడా టాక్ వినిపించింది.
ఇలాంటి క్రమంలో తాజాగా లహరిన్ అనే వెబ్సైట్ వాళ్లు సమంతకు సంబంధించిన సెన్సేషనల్ విషయాన్ని రివిల్ చేశారు. తమిళ్ ఛానల్ అయినా గలాటా ఇండియా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో.. సమంత తన గురించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టిందని.. వెల్లడించారు. గలాటా ఇండియా ఛానల్ లో సమంత ఇంటర్వ్యూ ఇస్తున్న టైంలో ఆమెకు ఓ డైరెక్టర్ నుంచి ఆడియో మెసేజ్ రాగా.. అది లైవ్ లోనే ఓపెన్ చేసి విన్న సమంత తర్వాత సిగ్గుతో నవ్వేసిందని.. ఒక లవర్ మెసేజ్ పెడితే ఎలా అయితే ప్రియురాలు సిగ్గుపడుతుందో అలా సమంత ఇంటర్వ్యూలో చేసిందంటూ లెహరాన్ వాళ్ళు వెల్లడించారు.
అంతేకాదు సమంతని దగ్గరుండి చూసిన ప్రత్యేక సాక్షులు కూడా సమంతకు మెసేజ్ రావడంతో ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయని.. అది ఆ డైరెక్టర్ మెసేజే అని వాళ్ళు చెప్పినట్లు బాలీవుడ్ ప్రముఖ వెబ్సైట్ అయిన షాహిద్ కామ్‌లో న్యూస్ వైరల్ అయింది. సమంత చాలా రోజుల నుంచి రాజ్ నిడమోరు ప్రేమలో ఉందని వస్తున్న వార్తలు కొన్ని ప్రముఖ వెబ్సైట్‌లో రావడంతో నిజంగానే సమంత డేటింగ్ ఉంది అనడానికి ఉదాహరణగా మారాయి. సమంత డైరెక్టర్ తో ప్రేమలో ఉందనటానికి కూడా ప్రూఫ్స్ అంటూ చాలామంది నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగానే సమంత అతనితో ప్రేమలో ఉందో లేదో తెలియాలంటే మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వాల్సిందే.