ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో గేమ్ ఛేంజర్ సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత వచ్చిన డాకుమారాజ్ మొదట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదరకొట్టినా.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా డామినేషన్ తో డాకు మహారాజ్ కూడా మెల్లమెల్లగా వెనక్కు తగ్గుతూ వచ్చింది. జనవరి 14న రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం ఇప్పటికే కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఏకంగా రూ.165 కోట్లకు పైగా వసుళను కొల్లగొట్టింది.
ఇక తాజాగా.. ఆరవ రోజు హైయస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రేర్ రికార్డును తన సొంతం చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ఆరవ రోజు అత్యధిక కలెక్షన్లు రూ.9.54 కోట్ల షేర్ సాధించిన సినిమాగా ఆర్ఆర్ నిలవగా.. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్దలు కొట్టి ఆ ప్లేస్ ను సొంతం చేసుకుంది. వెంకీ మామ కెరీర్ లోనే సినిమా ఆల్ టైం హిట్గా నిలిచిపోయింది. ఇప్పటికే వందకొట్లే షేర్ రాబట్టి సినిమాగా నార్త్ అమెరికాలో జోరు కొనసాగిస్తుంది. అక్కడ ఇప్పటివరకు 2.1మిలియన్ డాలర్ గ్రాస్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. యూకే లో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది.
తాజాగా అనీల్ రావిపూడి దీనికి సిక్వెల్ ఉంటుందని వెల్లడించాడు. అది కూడా మళ్ళీ సంక్రాంతి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే మరో పక్క బాలయ్య డాకు మహరాజ్ సినిమా ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్నా.. ఈ సినిమాకు ఎనిమిది రోజుల్లో రూ.156 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ విషయాన్నీ నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వివరించింది. ఇక బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ప్రగ్యా, శ్రద్ధ హీరోయిన్గా కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెల ఐటెం సాంగ్‌లో మెరిసింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు నాగవంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అలా సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా రెండో స్థానంలో రాణిస్తుంది.