ప్రభాస్ పెళ్లికి అడ్డుపడుతున్న టాలీవుడ్ పెద్దమనిషి.. అతని వల్లే ప్రభాస్ పెళ్లి అవ్వడం లేదా..?

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సాధర‌ణ‌ ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న విషయం ప్రభాస్ పెళ్లి. ఎప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా అంటూ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చేసుకుంటాడు.. అప్పుడు చేసుకుంటాడంటూ వార్తలు రావడమే కానీ.. ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి పై ఒక్కసారి కూడా అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుంటాడని నమ్మకం మాత్రం అందరిలోనూ ఉంది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన కామెంట్స్ తో ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి అయిపోతుందని అంత ఫిక్స్ అయ్యారు. కానీ.. ఆ నమ్మకాన్ని కూడా టాలీవుడ్‌కు చెందిన ఓ పెద్దమనిషి వ‌మ్ము చేసేస్తున్నాడు. ఓ స్టార్ ప్రొడ్యూసర్ ప్రభాస్ పెళ్లికి అడ్డుపడుతున్నాడంటూ వార్తలు ఇప్పుడు తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఇంతకీ ప్రభాస్ పెళ్లికి అడ్డుపడుతున్న ఆ పెద్దమనిషి ఎవరో.. అసలు మేటర్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రభాస్ ప్రస్తుతం ది రాజ్యసభ సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హ‌నురాగపూడి డైరెక్షన్లో ఫౌజి సినిమాలో కనిపించనున్నాడు. అలాగే త్వరలో స‌లార్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇన్ని షూటింగ్‌లు పెట్టుకున్న ప్రభాస్.. ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుంటారని ఎక్కడో అభిమానుల్లో అయితే నమ్మకం ఉంది. కానీ.. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది. తాజాగా ఇంటర్వ్యూలో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ ద‌త్త్‌ మాట్లాడిన మాటలు నమ్మకాన్ని పోగొట్టేసాయి. ఆయన మాటలతో ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది కూడా కష్టమైనంటూ పెదవి వివరిస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ అశ్విని దత్త్‌ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.

Kalki 2898 AD movie review in quick 10 points

గ‌తేడాది ప్ర‌భాస్ క‌ల్కితో ఆడియ‌న్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సీక్వెల్ జూన్ నుంచి ప్రారంభం అవుతుందని.. జూన్‌ నుంచి సినిమా సెట్స్ పైకి రానుందని అశ్విని ద‌త్త్ వివరించాడు. దీంతో ఓవైపు మూడు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టుకుని మరో సినిమా కూడా చేయడం అంటే ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోతే ప్రభాస్ కి ఇంక పెళ్లెప్పుడు అవుతుంది అంటూ.. ఈ ఏడాది ప్రభాస్ పెళ్లికి మాత్రం అశ్విని అడ్డుపడుతున్నాడు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సింపుల్‌గా అయ్యిన ఈ ఏడాది ప్ర‌భాస్ పెళ్ళి చేసేసుకుంటాడా.. లేదా పెళ్లి చేసుకోకుండా మళ్ళీ ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్మెంట్ మిగిల్చేస్తారా వేచి చూడాలి.