” అఖండ 2 “లో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్.. ఏ రోల్‌లో నటిస్తోందంటే..?

నందమూరి న‌ట‌సింహం బాల‌య్య డాకు మ‌జ్ఞ‌రాజ్‌తో సంక్రాంతికి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి సినిమా కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే బాలయ్య.. నెక్స్ట్ బోయపాటి డైరెక్షన్‌లో అఖండ 2తో ఆడియన్స్‌ను పలకరించినన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా కాస్టింగ్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నా.. 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది అంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. 90స్‌లో కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా తన అందం, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శోభన.

Akhanda 2 - Thaandavam': Nandamuri Balakrishna's next with Boyapati Sreenu  launched - The Hindu

18 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ కల్కి సినిమాలో మరియం రోల్‌లో నటించింది. అయితే ఆమె బాలయ్య అఖండ 2 సినిమాలోని ఓ కీల‌క పాత్రలో కనిపించనుందట. ఆ పాత్ర ఓ శాన్యాసిని పాత్ర అని తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్యతో నారి నారి నడుమ మురారి, మువ్వగోపాలుడు లాంటి సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకుంది. కాగా ఇటీవల డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ మహా కుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయని.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. అఘోరా నేపథ్యంలో సాగే కథ ఇది అంటూ వెల్లడించాడు. సినిమాలోని కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేస్తున్నామని.. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. ఈరోజుతో ఇక్కడ షూట్ పూర్తయింది.

అఖండ 2'లో లేడీ అఘోరిగా ఆ హీరోయిన్‌..! | The heroine as Lady Aghori in 'Akhanda  2'..!

నాగ సాధువులు అఘోరాలను కలిశాం. మా ప్రయత్న లోపం లేకుండా మూవీ అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. 2020లో వచ్చిన అఖండ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా అఖండ 2 తాండవం రూపొందుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చంట, గోపీచంద్ అచ్చంట ప్రొడ్యూసర్లుగా.. ఎం.తేజస్విని సమర్పకురాలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థ‌మ‌న్‌ సంగీతం అందించనున్నాడు. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా బాలయ్యకు ఎలాంటి మార్కెట్ తెచ్చి పెడుతుందో చూడాలి.