తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ అన్‌స్టాపబుల్ 4.. లేటెస్ట్ ఎపిసోడ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ ఎపిసోడ్ షూటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ ఎపిసోడ్‌లో చరణ్, బాలయ్య మధ్య జరిగిన సరదా చిట్‌చాట్ ఆడియన్స్‌ను అధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ఎపిసోడ్‌లో చరణ్ చిన్ననాటి స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్, వికాస్ లు కూడా సందడి చేశారు. ముగ్గురితో బాలయ్య కొన్ని టాస్కులు ఆడించాడు. ఇక ఈ ముగ్గురు కలిసి ఉన్నంత సేపు సెట్ లో ఫన్ నిండిపోయిందట. బాలయ్య కూడా వాళ్లతో కలిసి సందడి చేశాడు. ఇక బాలయ్య కూడా చరణ్‌తో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేయించినట్లు సమాచారం.
ఇక గతంలో.. ప్రభాస్ వచ్చినపుడు చరణ్కు కాల్ చేయగా.. ప్రభాస్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్.. తర్వాత నువ్వు వస్తావుగా బాలయ్య షోకి.. అప్పుడు నువ్వు నాకే కాల్ చేస్తావు. నేను నీతో ఎలా ఆడుకుంటానో చూడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేసాడు. దానికి తగ్గట్టుగానే చరణ్.. ప్రభాస్‌కు ఈ ఎపిసోడ్లో ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు చరణ్‌ను ప్రభాస్ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడట. ఒరేయ్ చరణ్.. భలే దొరికావురా అంటూ ప్రభాస్, రామ్‌చరణ్‌తో ఫన్నీ ఫోన్‌కాల్ కాన్వర్జేషన్ జరిపినట్లు సమాచారం. అంతేకాదు ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ కూడా ప్రభాస్ రివీల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రానున్న ప్రోమోలో ఈ సన్నివేశాలు అన్నీ చూపించమన్నారు.
ప్రోమో కట్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు లేదా రేపు ప్రోమో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా రానుందట. చరణ్ తన చిన్ననాటి విశేషాలు.. తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ తో ఉన్నాను అనుబంధం గురించి ఎమోషనల్ విషయాలు షేర్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు మోడీతో తన అన్నయ్య చిరంజీవి చేతులు పట్టుకుని.. పైకి లేపిన సందర్భాన్ని చరణ్ గుర్తు చేసుకుని చాలా గొప్పగా వర్ణించాడట. ఆ టైంలో ఆయన ఎమోషనల్ అవ్వడం మనమంతా చూసాం. అలా చెప్పుకుంటూ పోతే ఈ ఎపిసోడ్ అన్‌స్టాపబుల్‌లోనే ది బెస్ట్ గా ఉండనుందని టాక్ నడుస్తుంది. అంతేకాదు.. ఈ ఎపిసోడ్‌కు కూడా సందడి చేశాడు. సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.