సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది హీరోయిన్లుగా ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటారు. అలా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో కూడా ఎంతోమంది హీరోయిన్స్ అడుగుపెడుతూ ఉంటారు. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిందట.
ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ సినీ నటుడు అని చాలామందికి తెలిసి ఉండదు. ఆయన టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. రెండు జళ్ళ సీత, ఆనందభైరవి లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ ముద్దుగుమ్మ తాత కూడా.. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటుడే. అలాగే నిర్మాతగా కూడా మంచి ఇమేజె దక్కించుకున్నాడు. ఇక ఐశ్వర్య రాజేష్ మేనత్త శ్రీలక్ష్మి ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి ఆకట్టుకుంది. దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించిన శ్రీలక్ష్మి ఇప్పటి జనరేషన్ పిల్లలకు కూడా తెలిసే ఉంటుంది. కాగా.. ఐశ్వర్యరాజేష్ తండ్రి హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన క్రమంలో ఐశ్వర్య ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది.
నటుడు రాజేష్ సంపాదించిన డబ్బు అంతా దానధర్మాలకు పంచేసేవారిని.. తర్వాత నెమ్మదిగా ఆయన మధ్యానికి బానిస కావడంతో అతని ఆరోగ్యం నాశనం అయిందని.. తల్లి ఐశ్వర్యతో పాటు, ముగ్గురు అన్నయ్యలను పెంచడానికి ఎన్నో కష్టాలు పడిందట. చిన్న ఉద్యోగం చేస్తూ పోషిస్తున్న సమయంలోనే లివర్ చెడిపోవడంతో ఐశ్వర్య తండ్రి రాజేష్ మరణించాడట. అప్పట్లోనే తన సొంత ఇంట్లో ఉన్నప్పటికీ.. అప్పుల వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని ఇంట్లో నుంచి గెంటేసారట. ఇక బయటకు వచ్చేసిన తల్లి.. తన అన్నయ్యలను, ఐశ్వర్యని బాగా చదివించాలని భావించిందట.
కానీ.. దురదృష్టవశాత్తు ఆమె ఇద్దరు అన్నలు కూడా చనిపోయారు. ఈ విషయం తల్లిని బాగా డిప్లషన్‌కు గురి చేయడంతో.. ఆమె మంచానికే చాలాకాలం అంకితమైందట. దీంతో.. ఐశ్వర్య రాజేష్ కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో సీరియల్స్‌లో నటించడానికి ఓకే చెప్పింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనిచేసినందుకు కేవలం 500 తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం చేతి నిండా సంపాదిస్తుంది. అయితే ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన సమయంలో కూడా కలర్ గురించి చాలామంది ఆమెను ఎగతాళి చేసినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.