ఆ టాలీవుడ్ హీరోతోనే రష్మిక పెళ్లి.. గుట్టు ర‌ట్టు చేసిన టాప్ ప్రొడ్యుస‌ర్‌..?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన.. ప్రస్తుతం వరుస సూపర్‌హిట్ సినిమాలతో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ సక్సెస్‌ల‌తో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. త‌న అంద‌చందాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు.. కమర్షియల్ సినిమాలతో పాటు, ఫిమేల్ సెంట్రిక్‌ సినిమాల్లోనూ నటిస్తుంది. యానిమల్ తర్వాత పుష్ప 2తో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఈ సినిమాలో సత్తా చాటుకుంది. అయితే రష్మిక మందన ప్రొఫెషనల్ లైఫ్.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Thaman, Bobby, Naga Vamsi: Comedy Explosion on NBK! | Thaman, Bobby, Naga  Vamsi: Comedy Explosion on NBK!

అమ్మడి చేతిలో ఇప్పటికే అరడజన్ సినిమాలు ఉన్నాయి. వాటిలో మూడు, నాలుగు సినిమాలు ఇప్పటికే సెట్స్‌పై ఉండగా మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ అన్ని సినిమాలు వేటికవే చాలా స్పెషల్. ఇక రష్మిక ప్రొఫెషనల్ లైఫ్ కంటే.. పర్సనల్ లైఫ్ పైనే ప్రస్తుతం మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రష్మిక టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడింది అంటూ టాక్ ఎప్పటినుంచో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళు ప్రేమపై ఓపెన్ అవ్వలేదు కానీ.. వాళ్లతో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈ విషయం కన్ఫామ్ అయిపోయింది. అంతేకాదు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా ఇప్ప‌టికే అత‌నెవ‌రో అర్ధ‌మైఉంటుంది.

Rashmika: టాలీవుడ్ హీరోతో ర‌ష్మిక పెళ్లి - Latest Telugu News | తెలుగు  వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times

కాగా ఇటీవల రష్మిక పెళ్లి పై సక్సెస్ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు. డాకు మహారాజ్ ప్రమోషన్స్లో భాగంగా బాలయ్య అన్‌స్టాపబుల్‌కు వెళ్లిన నాగవంశీ.. ఈ షోలో రష్మిక ప్రస్తావన వచ్చిన వెంటనే క‌చ్చితంగా ఓ టాలీవుడ్ హీరో తోనే రష్మిక పెళ్లి ఉంటుందంటూ వెల్లడించాడు. అయితే.. ఏ హీరో అన్నది తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. ఆ హీరో ఎవరో తెలిసిన.. ఆయనా చెప్పడన‌ సంగతి అందరికీ తెలిసిందే. కానీ.. రష్మిక గురించి ఆమెతో పనిచేసే ఓ నిర్మాత ఇలా డైరెక్ట్ హింట్ ఇవ్వడం.. ఒక టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకుంటుంది అంటూ చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఇక నాగ‌వంశీ కామెంట్స్‌పై రష్మిక ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.