మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశాడు. ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో.. ప్రస్తుతం నాలుగో సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తుంది. ఇప్పటివరకు రాని సెలబ్రిటీస్ని తీసుకొస్తూ.. ముఖ్యంగా సంక్రాంతి రిలీజ్ ఉన్న స్టార్ సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా.. వాళ్లతో సందడి చేస్తున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే ఇప్పటికే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ కోసం ఈ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక.. తాజాగా రామ్‌చరణ్ గెస్ట్‌గా వెళ్ళాడు. ఆహా.. అన్‌స్టాపబుల్ షోలో చరణ్ రావడం ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కల్పించింది.
అయితే ఈ ఇంటర్వ్యూలో చరణ్ తన పర్సనల్, ప్రొఫెషనల్ కు సంబంధించిన ఎన్నో విషయాలను బాలయ్యతో షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే చరణ్ తన సోదరుడు అకీరా నందన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. షోలో ఆఖీరా నందన్ గురించి మాట్లాడిన చరణ్.. తను చాలా సైలెంట్ గా ఉంటాడని వెల్లడించాడు. అంతేకాదు.. వాళ్ళ నాన్నలాన్నే.. చాలా పద్ధతిగా ఉంటాడని అకిరా పై ప్రశంసలు కురిపించాడు. ఇక నాకు మొదటి నుంచి బుక్స్ చదవడం అంతగా ఇష్టం ఉండదని.. కానీ అకిరా మాత్రం తనకు బుక్స్ కానుకలుగా ఇస్తూ ఉండేవాడు.. అయితే తను చేసిన ఈ అలవాటు వల్ల ఇప్పుడు అతను ఇచ్చిన బుక్స్‌ని నేను చదువుతున్న అంటూ రామ్‌చరణ్ వివరించాడు.
ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే చరణ్‌కు ఎలాంటి అభిమానం ఉందో అందరికీ తెలిసిందే. అలానే.. అకిరాపై కూడా.. తన బ్రదర్ హుడ్‌ని చూపిస్తూ ప్రశంసలు కురిపించాడు. చరణ్ ఇప్పటివరకు వచ్చిన అందరు సెలబ్రిటీల హంగామా ఫ్యాన్స్‌కు ఏ రేంజ్‌లో కిక్కిచ్చిందో తెలిసిందే. అయితే చరణ్ ఎపిసోడ్ కచ్చితంగా మరింత స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇక చరణ్ గేమ్ ఛేంజర్ అందరితో పాటు.. ఈ సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో బాలయ్య తమ రెండు సినిమాలు సక్సెస్ అవ్వాలని సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే కోరుకున్నాడు. ఇక చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10 న రిలీజ్ ఉండగా.. బాలయ్య.. డాకు మహారాజ్ జనవరి 12న రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలు మధ్య గట్టిపోటి ఏర్పడనుంది.