టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 సినిమా సెట్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దేవర లాంటి సూపర్ డూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న తారక్.. వచ్చే ఏడాది రెండు భారీ బడ్జెట్ సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. వాటిలో ఒకటి బాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పాటు నటించనున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై ఇండియన్ సినీ ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు.. ఏ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. పైగా.. ఎన్టీఆర్ బాలీవుడ్‌లో నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. దానికి తోడు స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో చేస్తున్న మల్టీ స్టారర్ కావడంతో.. తారక్ అభిమానులంతా సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే.. లేటెస్ట్‌గా వార్ 2 సినిమాలో.. తారక్ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ ట్రెండింగ్‌గా మారుతుంది.
వాటిలో తారక్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని.. ఆడియన్స్‌కు గూస్ బంప్స్ కాయమంటూ తెలుస్తోంది. ఇక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఏదేమైనా వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ రోల్ పై వస్తున్న ఈ వార్తల్లో నిజం ఏంటో తెలియదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ అభిమానులకు మాత్రం ఫుల్ కిక్ ఎక్కిస్తుంది. ఇక ఈ సినిమా షూట్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీలో డైరెక్షన్లో మరో భారీ ప్రాజెక్టులో నటించనున్నాడు తారక్.