టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు విమర్శలు ఎదుర్కొన్న ఏమాత్రం తడపడకుండా స్ట్రాంగ్ గా నిలబడి ఈ ఏడాది ఎలక్షన్‌లలో 100% సక్సెస్ అందుకున్నాడు పవన్.. తాను కూడా పిఠాపురం నుంచి భారీ మెజారిటీ దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో తన పనితీరుతో అందరినీ మెప్పిస్తున్న ఆయన.. సినిమాలకు తగిన సమయం కేటాయించడానికి ఎంతో కష్టపడుతున్నారు.
గతంలో షూటింగ్ జరుపుకున్న సినిమాలకే డేట్లు ఇవ్వాలని పరిస్థితిలో ఉన్న పవర్ స్టార్.. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ బగత్ సింగ్ సినిమాలను పెండింగ్లో ఉంచాడు. వచ్చే ఏడాది హరిహర వీరమల్లు సినిమా పూర్తిచేసుకుని ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. డేట్ల విషయం ఇంకా తేలనే లేదు.. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్, సుకుమార్ కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ స్టోరీ మిస్ అయిందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం పవన్ పెండింగ్ లో ఉన్న సినిమాలు చేయడానికి నాన్న తండాలు పడుతున్నాడు. కానీ.. పవన్ వరుసగా సినిమాలు చేస్తున్న టైంలోనే సుకుమార్ పవన్ కోసం ఒక కథను రాసుకున్నాడట. ఆ కథ పవన్ కు కూడా వినిపించాడట.
ఇక సుక్కుతో సినిమా అంటే ఎక్కువ టైం కేటాయించాలి.. భారీగా డేట్స్ ఇవ్వాల్సి వస్తుందని.. ఓవైపు రాజకీయాలతో, సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఆ డేట్స్ సర్దుబాటు చేయడం కుదరలేదట. అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం.. పవన్ తో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాడు. ఇక ఆ కథ వేరే హీరోతో చేయడానికి కూడా సుకుమార్ ఇష్టపడలేదట. కేవలం పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ పవర్ ఫుల్ స్టోరీని డిజైన్ చేసుకున్న.. కథ మరెవరో నటించినా అసలు సెట్ కాదు. ఈ ఉద్దేశంతోనే సుకుమార్ కథను పక్కన పడేసారని తెలుస్తోంది. అలా వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన బ్లాక్ బస్టర్ మూవీ మిస్సయింది. అయితే ఇప్పటికి సుకుమార్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే అదే స్టోరీ తో సినిమా చేయాలని ఉద్దేశం లో ఉన్నాడట.