టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకటి. చందు మొండేటి డైరెక్టర్‌గా నాగ చైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బోల్తా కొట్టిన.. అమ్మడి నటన, అందానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తెలుగులో భారీగా అవకాశాలు క్యూ కట్టాయి.
అలా ఇప్పటివరకు చాలా తెలుగు సినిమాల్లో ఈమె నటించిన కమర్షియల్‌గా మాత్రం.. మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మకు ఇద్దరు స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్. ఇద్దరు సినిమాల్లో నిధి అగర్వాల్ అవకాశాలు కొట్టేసింది.
పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ప్రభాస్‌తో రాజాసాబ్ సినిమాలో హీరోయిన్గా మెరవనుంది. రెండు సినిమాలు ఆల్మోస్ట్ షూట్ పూర్తి చేసుకున్నాయి. వచ్చే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సినిమాలు రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటే అమ్మడికి స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజె ఏర్పడుతుంది. అంతేకాదు.. అమ్మడి కోసం.. క్రేజీ ప్రాజెక్టులకు క్యూ కడతాయి. మరి ఈ రెండు సినిమాలు కొత్త ఏడాదిలో నిధి అగర్వాల్ వీధిని ఎలా చేంజ్ చేస్తాయో.. ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తాయో వేచి చూడాలి.